Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ వర్శిటీల్లో రెండో స్థానంలో జేఎన్‌యూ
- ఉస్మానియా యూనివర్సిటీకి 22వ ర్యాంకు..
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 10వ ర్యాంకు
- ఐఐటీ హైదరాబాద్ 68.03 స్కోరుతో తొమ్మిదో స్థానం
- ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు విడుదల
న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తుతమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరసగా నాలుగో ఏడాది తొలి స్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో రెండో స్థానంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సి టీ (జేఎన్‌యూ) నిలిచింది. శుక్రవారం నాడిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద 11 విభాగాల్లో కేంద్ర విద్యా శాఖ రూపొందించిన జాబితాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు.
ఫార్మసీ విభాగంలో నైపర్, హైదరాబాద్ రెండో ర్యాంకు న్యాయ విద్యలో హైదరాబాద్‌లో ని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నాలుగో ర్యాంకు సాధించాయి. విశ్వవిద్యాలయాల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి 22వ ర్యాంకు, ఆంధ్ర యూనివర్సిటీ 36వ స్థానంలో నిలిచాయి. టాప్ 100 ఇంజినీరింగ్ కాలేజీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 కాలేజీలున్నాయి. టాప్100 ఫార్మసీ కాలేజీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 కాలేజీలున్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ, హైదరాబాద్ 12వ ర్యాంకు సాధించింది. డెంటల్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ భీమవరంలోని విష్ణు డెంటల్ కాలేజీ 24, గీతం కాలేజీకి 33వ ర్యాంకు దక్కాయి. ఆర్కిటెక్చర్ విభాగంలో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్‌కు జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు దక్కింది. మెడికల్ విభాగంలో 50 ర్యాంకులు ప్రకటించగా తెలుగు రాష్ట్రాల్లోని కళాశాలలకు స్థానం దక్కలేదు.
ఓవరాల్ ర్యాంకింగ్
ఐఐటీ మద్రాస్ (87.59 స్కోరు) తొలిస్థానంలో నిలవగా, 83.57 స్కోరుతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) బెంగళూరు రెండోస్థానంలో, 82.35 స్కోరు తో ఐఐటీ ముంబాయి మూడో స్థానంలో నిలిచింది. నాలుగు నుంచి పది స్థానాల్లో వరుసగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్ పూర్, ఐఐటీ రూర్కే, ఐఐటీ గౌహతి, ఎయిమ్స్ ఢిల్లీ, జేఎన్‌యూ నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్ 62.86 స్కోరుతో 14వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 59.67 స్కోరుతో 20వ ర్యాంకు, ఎన్ఐటీ వరంగల్ 50.61 స్కోరుతో 45వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 50.60 స్కోరుతో 46వ ర్యాంకు, కెఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 49.71 స్కోరుతో 54వ ర్యాంకు, ఆంధ్రా యూనివర్సిటీ 47.97 స్కోరుతో 71వ ర్యాంకులో నిలిచాయి.
యూనివర్సిటీలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) బెంగళూరు 83.57 స్కోరుతో తొలి స్థానంలో నిలవగా, జేఎన్‌యూ 68.47 స్కోరుతో రెండో స్థానంలో, జామియా మిలియా ఇస్లామియా 65.91 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 61.71 స్కోరుతో 10వ ర్యాంకు, 53.07 స్కోరుతో 22వ ర్యాంకు, కెఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 52.33 స్కోరుతో 27వ ర్యాంకు, ఆంధ్రా యూనివర్సిటీ 50.52 స్కోరుతో 36వ ర్యాంకు, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 45.07 స్కోరుతో 67వ ర్యాంకు, విశాఖపట్నంలోని గీతం కాలేజ్ 42.14 స్కోరుతో 92వ ర్యాంకు, గుంటూరులోని విజ్ఞాన్ కాలేజ్ 41.79 స్కోరుతో 95వ ర్యాంకు సాధించాయి.
కాలేజీలు
ఢిల్లీలోని మిరండా హౌస్ 78 స్కోరుతో తొలిస్థానం, హిందూ కాలేజ్ 71.86 స్కోరుతో రెండో స్థానంలో చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజ్ 71.67 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. కాలేజీల విభాగంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ) 52.38 స్కోరుతో 94 వ ర్యాంకు సాధించింది.
రీసెర్చ్
ఐఐఎస్ బెంగళూరు 88.62 స్కోరుతో తొలి స్థానం, ఐఐటీ మద్రాస్ 86.38 స్కోరుతో రెండో స్థానంలో ఐఐటీ ఢిల్లీ 82.16 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. ఐఐటి హైదరాబాద్ 57.96 స్కోరుతో 12వ ర్యాంకు, యూనివర్సి టీ ఆఫ్ హైదరాబాద్ 50.52 స్కోరుతో 27వ ర్యాంకు సాధించాయి.
ఇంజినీరింగ్
ఐఐటీ మద్రాస్ 90.94 స్కోరుతో తొలిస్థానం, ఐఐటీ న్యూఢిల్లీ 88.12 స్కోరుతో రెండో స్థానం, ఐఐటీ ముంబయి 83.96 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ హైదరాబాద్ 68.03 స్కోరుతో తొమ్మిదో స్థానం, ఎన్ఐటీ వరంగల్ 60 స్కోరుతో 21వ ర్యాంకు, కెఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 44వ ర్యాం కు, ఐఐటి తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ 46.41 స్కోరుతో 62వ ర్యాంకు, జేఎన్ టీయూ హైదరాబాద్ 42.77 స్కోరుతో 76వ ర్యాంకు, విశా ఖపట్నంలోని ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఏ) 42.76 స్కోరుతో 77వ ర్యాంకు, వరంగల్‌లోని ఎస్ఆర్ యూనివర్సి టీ 40.69 స్కోరుతో 91వ ర్యాంకు, గుంటూరులోని విజ్ఞాన్ 40.16 స్కోరుతో 99వ స్థానంలోనిలిచాయి.
మేనేజ్మెంట్
ఐఐఎం అహ్మదాబాద్ 83.35 స్కోరుతో తొలి ర్యాంకు, ఐఐఎం బెంగళూరు 82.62 స్కోరుతో 2వ ర్యాంకు, ఐఐఎం కలకత్తా 78.64 స్కోరుతో మూడో ర్యాంకు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఇక్ఫారు ఫౌండేషన్ ఫర్హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ 54.88 స్కోరుతో 32వ ర్యాంకు, ఐఐఎం విశాఖపట్నం 54.36 స్కోర్‌తో 33వ ర్యాంకు, కెఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 51.27 స్కోరుతో 47వ ర్యాంకు, చిత్తూరు శ్రీసిటి లోని క్రెయా యూనివర్సిటీ 48.93 స్కోరు తో 60వ ర్యాంకు, హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ 45.18 స్కోరుతో 75వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 42.62 స్కోరుతో 94వ ర్యాంకు సాధించాయి.
ఫార్మసీ
జామియా హమ్దర్ద్, న్యూఢిల్లీ 79.50 స్కోరుతో తొలి ర్యాంకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రిసెర్చి హైదరాబాద్ 79.46 స్కోరుతో రెండో ర్యాంకు సాధించగా హన్ముకొండలోని కాకతీయ యూనివర్సి టీ 47.38 స్కోరుతో 44వ ర్యాంకు, విశాఖపట్నంలోని గీతం 46.66 స్కోరుతో 49వ ర్యాంకు, గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ 46.04 స్కోరుతో 51వ ర్యాంకు, భీమవరంలోని శ్రీ విష్ణు కాలేజ్ 44.80 స్కోరుతో 54వ ర్యాంకు, హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్సిటీ 44.31 స్కోరుతో 58వ ర్యాంకు, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 43.05 స్కోరుతో 66వ ర్యాంకు, తెలంగాణ నర్సాపూర్‌లోని విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రిసెర్చి 43 స్కోరుతో 67వ ర్యాంకు, చిత్తూరులోని శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 42.73 స్కోరుతో 68వర్యాంకు, అనంతపురంలోని రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యూటికల్ ఎడ్యుకేషన్, రిసెర్చి 41.86 స్కోరుతో 71వ ర్యాంకు, రంగారెడ్డిలోని సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 41.72 స్కోరుతో 72వ ర్యాంకు, గుంటూరులోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ 40.27 స్కోరుతో 77వ ర్యాంకు, తిరుపతిలో ని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ 38.66 స్కోరుతో 89వ ర్యాంకు, హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 38.21 స్కోరుతో 93వ ర్యాంకు, మంగళగిరిలోని నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 37.69 స్కోరుతో 100 ర్యాంకు సాధించాయి.
డెంటల్
సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్, టెక్నాలజీ సైన్సెస్ చెన్నై 82.30 స్కోరుతో తొలి ర్యాంకు, మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 77.28 స్కోరుతో 2వ ర్యాంకు, డాక్టర్ డివై పాటిల్ విద్యాపీఠ్, పుణే 76.67 స్కోరుతో మూడో ర్యాంకు సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం 53.73 స్కోరుతో 24వ ర్యాంకు, గీతం డెంటల్ కాలేజ్, హాస్పటల్, విశాఖపట్నం 50.45 స్కోరుతో 33వ ర్యాంకు సాధించాయి.
మెడికల్
మెడికల్ విభాగంలో ఎయిమ్స్, ఢిల్లీ 91.60 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచింది. రెండు నుంచి ఐదు స్థానాల్లో వరుసగా పిజిఐఎంఈఆర్, చండీఘడ్, క్రిస్టియన్ కాలేజీ, వెల్లూరు, ఎన్‌ఐఎంహెచ్‌ఎన్‌ఎస్, బెంగళూర్, బెనారస్ యూనివర్సిటీలు నిలిచాయి.
న్యాయ (లా)
న్యాయ విభాగంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూర్, నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ, సింబయాసిస్ లా స్కూల్ పుణే, నల్సార్ యూనివర్శిటీ హైదరాబాద్, పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జూడిషియల్ సైన్స్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.
ఆర్కిటెక్చర్
ఆర్కిటెక్చర్ విభాగంలో ఐఐటీ రూర్కే, ఎన్ఐటీ కాలికట్, ఐఐటీ ఖరగ్‌పూర్ మొదటి మూడు స్థానాల్లో నిలి చాయి. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయ వాడ ఏడో స్థానంలో నిలిచింది.