Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా 497 నగరాల్లో పరీక్ష
- భారత్ వెలుపల 14 నగరాల్లో..
- సర్వం సిద్ధం చేసిన ఎన్టీఏ
- హాజరు కానున్న 18 లక్షల మందికి పైగా విద్యార్థులు
- మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5.20 గంటల వరకు ఎగ్జామ్
న్యూఢిల్లీ : భారత్లో ప్రతిష్టాత్మక నీట్ పరీక్ష నేడు జరగనున్నది. ఇందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లనూ చేసింది. భారత్లోని 497 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. భారత్ వెలుపల 14 నగరాల్లో పరీక్షలకు రంగం సిద్ధం చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇటు పరీక్షకు హాజర కాబోయే విద్యార్థులకు ఎన్టీఏ మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం 13 భాషల్లో (ఇందులో 12 భారతీయ భాషలు) ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్, డెంటల్, ఆయుర్వేద వంటి వైద్య కోర్సుల్లో నీట్-యూజీ 2022-23లో ప్రవేశాల కోసం 18 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18,72,329 మంది అభ్యర్థుల్లో 10,64,606 మంది బాలికలు ఉన్నారు. 8,07,711 మంది బాలురు ఉన్నారు. 12 భారతీయ భాషల్లో పరీక్షలు రాసే వారి సంఖ్య గత ఐదేండ్లలో 274.3 శాతం పెరుగుదల నమోదైంది. 2021తో పోలీస్తే తమిళ భాషలో పరీక్ష రాసే వారి సంఖ్య 60 శాతం పెరిగింది. ఆంగ్ల మాద్యమంలో పరీక్ష రాసేవారి సంఖ్య 14,78,540 మందిగా ఉన్నారు. ఆ తర్వా హిందీలో 2,57,132 మంది, గుజరాతీలో 49,625 మంది, బెంగాలీలో 42,136 మంది, తమిళంలో 31,803 మంది నీట్ రాసేవారున్నారు.