Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమాన ఇంధన ధరల తగ్గింపు
న్యూఢిల్లీ : పేద, సామాన్య ప్రజలు ఉపయోగించే పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం తగ్గించని కేంద్ర ప్రభుత్వం.. ధనవంతులు ప్రయాణించే విమానాల్లో ఉపయోగించే ఇంధన ధరలను మాత్రం తగ్గించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలను 2.2 శాతం తగ్గిస్తూ శనివారం చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కిలోలీటర్ ఏటీఎఫ్‌పై రూ.3,084.94 లేదా 2.2 శాతం తగ్గి రూ.138,147.93గా నమోదయ్యింది. ఈ ఏడాదిలో ఏటీఎఫ్ రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. విమాన ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నందున వాటిని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా చమురు సంస్థలు, విమానయాన సంస్థల ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సమీక్షించేలా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో విమానయాన కంపెనీలపై భారం తగ్గి.. ప్రయాణ ధరలు తగ్గొచ్చని ఆ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.