Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక వర్గ ఐక్యత, పోరాటాలకు పదును పెట్టాలి
- రాజ్యసభ ఎంపీ, సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎలమారం కరీం
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ 11వ జాతీయ మహాసభలు ప్రారంభం
న్యూఢిల్లీ : కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధతం చేసేందుకు సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యులు, సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎలమారం కరీం పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు హర్యానాలోని హిసార్ (మహమ్మద్ అమీన్ నగర్, శ్యామలా చక్రవర్తి మంచ్)లో జరుగబోయే ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీబ్ల్యూఎఫ్) 11వ జాతీయ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆటో రిక్షా, టాక్సీ, ట్రక్కు, ప్రయివేటు బస్సు, రాష్ట్ర రవాణా బస్సు కార్మికులు మొదలైన రోడ్డు రవాణాలోని అన్ని విభాగాలకు ప్రాతినిథ్యం వహిస్తూ దేశం నలుమూ లల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఎలమారం కరీం ప్రారంభోప న్యాసం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం పోరాటాలను తుంగలో తొక్కుతూ దేశ ఆస్తులను కొందరు కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఐక్య పోరాటాలు అవసరమని తెలిపారు. ప్రస్తుతం మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి, రైతులకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని విమర్శిం చారు. ఈ కాలంలో పేదలు చాలా పేదలుగా, ధనికులు మరింత ధనవంతులుగా మారారన్నారు. నిరుద్యోగం పెరుగుతున్నదనీ, ధరల పెరుగుదల ఆకాశన్నంటుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కారు ప్రభుత్వ రంగాన్ని వ్యూహాత్మకంగా నాశనం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కార్మికులను యజమానుల దయకు వదిలేస్తూ ప్రస్తుత కార్మిక చట్టాల స్థానంలో కోడ్లను తీసుకొచ్చి ందని విమర్శించారు. మోటర్ వెహికల్ చట్టం సవరణ తరువాత రోడ్డు రవాణా రంగం అత్యంత ప్రభావమైందన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రవాణ పరిశ్రమ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం అన్ని సంఘాలూ, భాగస్వామ్యదారులతో ఐక్య పోరాటానికి ముందుకు రావాలని సూచించారు. రవాణ పరిశ్రమల పరిస్థితి, రవాణా కార్మికుల సమస్యలపై ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. జాతీయ కార్యదర్శి విఎస్ రావు తీర్మానాన్ని బలపరిచారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ముంబ యిలోని బెస్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శశాంక్ రావు, సీఐటీయూ హర్యానా ప్రధాన కార్య దర్శి జై భగవాన్, హర్యానా ఐఎన్టీయూసీ ప్రెసిడెం ట్ ధరమ్ వీర్, సర్వ కర్మచారి సంఫ్‌ు హర్యానా ప్రెసిడెంట్ శుభాస్ లాంబా తదితరులు మాట్లాడారు. ప్రభుత్వ క్రూరమైన విధానాలకు వ్యతిరేకంగా పోరా టాలు గురించి వివరించారు. ఆహ్వానం సంఘం ఛైర్మన్ సుభాష్ లాంబా తన స్వాగతోపన్యాసంలో హిసార్ నగర చరిత్రను వివరించారు.