Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద సహాయ కార్యక్రమాలపై ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి
అమరావతి : గోదావరి వరదల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని, సహాయక బృందాలను వినియోగించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో శనివారం అధికారు లతో సమీక్ష నిర్వహించారు. సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని సిఎం తెలిపారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన అన్ని కుటుంబాలకూ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కందిపప్పు, బంగాళ దుంపలు, ఫామాయిల్, ఉల్లిపాయలు ఒక కేజీ చొప్పున అందించాలన్నారు. ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు లేదా వ్యక్తికైతే రూ.1000 శిబిరాలు విడిచి వెళ్లేలోగా పంపిణీ చేయాలన్నారు. వరద పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని అధికారులకు సూచించారు. సమీక్ష నేపథ్యంలో వరద ప్రవాహం, సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పన, తాజా పరిస్థితులపై సిఎంకు అధికారులు వివరించారు.