Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటరీ బోర్డు నిర్ణయం : జెపి నడ్డా
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తరఫు అభ్యర్థిపై ఉత్కం ఠకు తెరపడింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ పేరును ఎన్డీయే ప్రకటించింది. ఈ మేరకు శనివారం నాడిక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జగదీప్ ధన్కర్ను ఎంపికచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జెపి నడ్డా మాట్లాడారు. జగదీప్ ధన్కర్ను తమ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినట్టు తెలిపారు.
జగదీప్ ధంకర్ నేపథ్యం
1951 మే 18న రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా కితానా గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సిహెచ్ గోకల్ చంద్, కేసరి దేవి. జాట్ సామాజిక వర్గానికి చెందిన ధంకర్, కితానా గ్రామంలో ప్రభుత్వ పాథమిక పాఠశాలలో 1 నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్య అభ్యసించారు. ఆరో తరగతి ఘర్ధన ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చేరారు. చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్లో ఆయన పాఠశాల విద్యను పూర్తి చేశారు. తరువాత జైపూర్‌లోని మహారాజా కళాశాలలో మూడేండ్లు బీఎస్సీ ఆనర్స్ ఫిజిక్స్‌లో పట్టభద్రుడయ్యారు. 1978-79లో రాజస్థాన్ యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1979 నవంబర్ 10న న్యాయవాదిగా రాజస్థాన్ బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు. 1990 మార్చి 27న నుండి సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. 1987లో అతిపిన్న వయస్సులో రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నియ్యారు. 1989-91లో రాజస్థాన్‌లోని ఝుంఝును లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనతాదళ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1990లో పార్లమెంటరీ కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రిగా పని చేశారు. 1993-2018లో రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ జైపూర్ అధ్యక్షుడుగా పని చేశారు.