Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్ బాధితుల కుటుంబ సభ్యులకు వెంటనే పరిహారం చెల్లించేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీ)నూ సుప్రీంకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత డిపాజిట్ (పీడీ) ఖాతాలకు మళ్లించిన రాష్ట్ర విపత్తు సహాయ నిధులు (ఎస్డీఆర్ఎఫ్) తిరిగి ఎస్డీఆర్ఎఫ్కు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం విపత్తు నిర్వహణ నిధులు మళ్లించిందంటూ ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ను సోమవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది.