Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ శాఖ
న్యూఢిల్లీ : దేశంలోని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. అయితే శుక్రవారం వరకు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వానలు పడుతూనే ఉంటాయని తెలిపింది. తమిళనాడులో ఈ నెల 18-20వ తేదీల్లో, తెలంగాణలో 18 నుంచి 22 వరకు భారీ వానలు నమోదవుతాయని తెలిపింది. జులై 18 నుంచి ఈశాన్య రాష్ట్రాలు, సబ్ హిమలయన్ పశ్చిమబెంగాల్‌తో పాటు జులై 19 నుంచి వాయువ్య భారత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. జులై 20న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జులై 18, 19 తేదీల్లో తూర్పు రాజస్థాన్‌లో కూడా జోరు వానలు పడనున్నాయి. ఇదే తేదీల్లో కొంకణ్, గోవాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి వాతావరణ శాఖ తెలిపింది. 18 నుంచి 20 వరకు కర్నాటక తీర ప్రాంతం, 19-20 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, 21-22 తేదీల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, 20-22 వరకు విదర్భ, 19-22 ఛత్తీస్‌గఢ్, 18-22 వరకు కేరళ, మహే ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా వేసింది. 18న ఆంధ్ర ఉత్తర తీర ప్రాంతం, యానాంలో భారీగా వానలు పడతాయని తెలిపింది. 18, 19 తేదీల్లో గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో కురవనున్నాయని పేర్కొంది.