Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్మదా నదిలో పడిన బస్సు :13 మంది మృతి
ధార్ : మధ్యప్రదేశ్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన బస్సు నర్మదా నదిలో పడిపోవడంతో 13 మంది మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా మృతి చెందారు. మరో 15 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ధార్ జిల్లాలోని ఆగ్రా-ముంబయి హైవేపై ఖాల్‌ఘాట్ ప్రాంతంలో ఒక వంతెన వద్ద ఉదయం 9:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని అమల్నెర్కు వెళుతున్న బస్సు వంతెనపై గల రెయిలింగ్‌ను గుద్దుకుని నదిలో పడిపోయింది.