Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక కు సంబంధించిన నామినే షన్ ఎన్డీఏ అభ్యర్థి జగ్దీప్ ధన్కర్ దాఖ లు చేశారు. సోమవారం పార్లమెం ట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ సెక్రెటరీ జనరల్, ఉపరాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉత్పల్ కుమార్ సింగ్కు ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పియూశ్ గోయల్, జై శంకర్, ప్రహ్లాద్ జోషి, నరేంద్ర సింగ్ తోమర్, భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్టవ్, అర్జున్ ముండా, జ్వోతిరాధిత్య సింధియా, పసుపతి కుమార్ పరాస్ (ఎల్జేడీ), అనుప్రియ పటేల్ (అప్నాదళ్), రాందాస్ అథ్వాలే (ఆర్పీఐ), రాజీవ్ రంజన్ లాలన్ సింగ్ (జేడీయూ), పినాకి మిశ్రా (బీజేడీ), తంబి దొరై (అన్నాడీఎంకే) తదితరులు పాల్గొన్నారు. కాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ధన్కర్కు వైసీపీ మద్దతు తెలిపింది.