Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో రవాణా దృగ్విషయాలలో పురోగతిపై అంతర్జాతీయ సమావేశం (ఐసీఏపీ 2022) లో వక్తలు
అమరావతి: విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్సెస్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఫినోమినా (ఐసీఏపీ 2022) 3-రోజుల అంతర్జాతీయ సదస్సు 16 జులై 2022 నుంచి 18 వరకు వర్చువల్ విధానంలో నిర్వహించారు. విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ డీన్ డా. శాంతను మండల్ అంతర్జాతీయ సదస్సుకు హాజరయిన అతిథులందరికీ స్వాగతం పలికారు, అనంతరం సదస్సు కన్వీనర్ డా . రష్మీ దూబే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మెన్, జేఎన్టీయూ-అనంతపురంలోని మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డా కె. హేమచంద్రారెడ్డి హాజరయ్యారు. అయన మాట్లాడుతూ ఫ్లూయిడ్ డైనమిక్స్ , రవాణా దగ్విషయాల రంగంలో పరిశోధన కోసం విస్తతమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయనీ, గణన అంశాలలో యువ పరిశోధకులు , ప్రొఫెసర్లకు విస్తత అవకాశాలకు ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడంతో పాటు అత్యుత్తమ విద్యను అందించటంలో విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం ఎల్లప్పుడు ముందుంటుందని కొనియాడారు . విఐటీ వ్యవస్థాపకుడు మరియు ఛాన్సలర్ డా జి విశ్వనాథన్ మాట్లాడుతూ జాతీయ, ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో మార్పులను తీసుకురావడానికి ఈ సదస్సు ద్వారా కృషి చేయాలనీ సదస్సులో పాల్గొన్న ఒత్సాహికులను ప్రోత్సహించారు.