Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోర్గాన్ స్టాన్లే
బెంగళూరు: భారత వృద్థి రేటు అంచనాలకు అంతర్జాతీ య ఎజెన్సీలు వరుసగా కోత పెడుతున్నాయి. 2023లో జీడీపీ 4.7 శాతానికే పరిమితం కావొచ్చని ఇటీవల నోమురా పేర్కొనగా.. తాజాగా మోర్గాన్ స్టాన్లే కూడా ఇదే బాటలో విశ్లేషణలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత జీడీపీ 7.2 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. ఇంతక్రితం అంచనాలతో పోల్చితే 40 బేసిస్ పాయింట్లు తగ్గుదల. అంతర్జాతీయ వృద్థి అంచనాల కంటే బలహీనంగా ఉందని మోర్గాన్ స్లాన్లే ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ ఉపాసన చచ్రా పేర్కొన్నారు. కమోడిటీ ధరలు పెరగడం, సరఫరాలో సమస్యలు వృద్థి రేటును ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు. ఆహారోత్పత్తుల ధరలు పెరగడం ఆర్థిక వ్యవస్థను సవాళ్లకు గురి చేస్తోందన్నారు.