Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు1నుంచి15 వరకు విస్తృతంగా కార్యక్రమాలు
- ప్రజల జీవనోపాధిపైన, గిరిజన హక్కులపైన
- దాడులను తిప్పికొట్టాలి: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పిలుపు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల జీవనోపాధిపైన, గిరిజన హక్కులపైన, రాజ్యాంగం, లౌకిక, ప్రజాస్వామ్య విలువలపైన ఇలా అన్ని రంగాలపైన బహుముఖ దాడులు జరుపుతోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విమర్శించింది. శనివారం నాడు న్యూఢిల్లీలో సమావేశమైన పార్టీ పొలిట్‌బ్యూరో ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదలజేసింది. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలపై పార్టీ వైఖరిని ఆ ప్రకటనలో పొలిట్‌బ్యూరో వెల్లడించింది. ప్రజల జీవనోపాధిపై పెరుగుతున్న దాడులు 2020-22లో భారత ఆర్థిక వ్యవస్థ వార్షిక వద్ధి కేవలం 0.8 శాతం మాత్రమేనని ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి.
ఆకాశాన్నంటుతున్న ధరలు
వార్షిక టోకు ధరల సూచి (డబ్యూపీఐ) 2022 మేలో 15.8 శాతానికి పెరిగింది. ధరలు ఇంత భయంకరంగా పెరగడం 1998 తరువాత ఇదే మొదటిసారి. ఆహార ధరల పెరుగుదల 14.4 శాతానికి చేరింది. ప్రాథమిక వస్తువులు 19.71 శాతం, ఇంధనం, విద్యుత్ 40.63 శాతం, తయారీ ఉత్పత్తులు 10.11 శాతానికి పెరిగాయి.
ఈ ధరల పెరుగుదల భారత ప్రజలను మరిన్ని కష్టాల పాల్జేస్తుంది. ప్రజల చేతిలో కొనుగోలు శక్తి మరింత సన్నగిల్లేలా చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్ మరింత కుంచించు కుపోతుంది. దేశీయంగా డిమాండ్ తగ్గడం వల్ల ఉత్పాదక కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉద్యోగాలు మరింతగా పడిపోయేందుకు ఇది దారి తీస్తుంది.
అసహ్యకరమైన స్థాయికి అసమానతలు
మతతత్వ-కార్పొరేట్ శక్తుల మధ్య అపవిత్ర పొత్తు, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం మన జాతీయ ఆస్తుల లూటీ వల్ల ఆదాయ, సంపదల్లో అసమా నతలు అసహ్యకరమైన స్థాయికి చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేయబడిన కంపెనీలు 2021-22లో 9.3 లక్షల కోట్లకు పైగా సామూహిక లాభాలను ఆర్జించాయి. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఇది 70 శాతం అధికం. మహమ్మారికి ముందు దశాబ్దం అంటే 2010-2022 మధ్య వార్షిక ఆర్జించిన సగటు లాభాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే అత్యంత సంపన్నులపై పన్ను విధించాలి. ఆ విధంగా సమకూరిన ఆదాయాన్ని మనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు, ఉద్యోగాలను సష్టించడానికి అలాగే ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్‌ను పెంచేలా ప్రభుత్వ పెట్టుబడులు పెంచేందుకు ఉపయోగించాలి.
తప్పనిసరి ఆధార్‌ను ఉపసంహరించుకోండి
పిల్లలకు అనుబంధ పౌష్టికాహార కార్య క్రమానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసం హరించుకోవాలి. 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టంతో పాటుగా రూపొం దించిన ఈ చట్టపర మైన హక్కును ఆరు నెలల నుంచి ఆరేళ్ల మధ్య ఉన్న లక్షలాది మంది పిల్లలకు పౌష్టికాహారం తిరస్కరిం చబడుతుంది. ప్రస్తుతం, 7.9 కోట్ల మంది పిల్లలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు కానీ, అధికారిక రికార్డుల ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కేవలం 23 శాతం మంది మాత్రమే ఆధార్ కార్డులను కలిగి ఉన్నారు. పిల్లల పౌష్టికాహార లోపం విష యంలోనూ భారతదేశం నేడు అత్యంత దారుణమైన రికార్డులను కలిగి ఉంది.
విద్యపై దాడులు
కోవిడ్ మహ మ్మారి సమ యంలో ఆంక్షలను ఉపయోగిం చుకుని జాతీయ విద్యా విధానం- 20 20ని దూకు డుగా ముందు కుతెచ్చింది. ఆన్లైన్ విద్యను ప్రవేశపెట్టేందుకు చేసిన యత్నాలు పెద్దయెత్తున వినాశనాన్ని కలిగిస్తాయి. లక్షలాది పాఠశాలలు మూసి వేయబడ్డాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయ స్థాయిలలో డ్రాపవుట్లు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. విద్యలోని లౌకిక, శాస్త్రీయ అంశాలపై అసహ్యకర మైన దూకుడుతో జరిపిన దాడి ఇది.
గిరిజనుల హక్కులపై దాడి
అటవీ సంరక్షణ చట్టంలోని నిబంధనలను సవరించడం ద్వారా మోడీ ప్రభుత్వం గిరిజనుల హక్కులపై దుర్మార్గపు దాడికి తెగబడింది. ఈ సవరణలు కార్పొరేట్లకు గరిష్ట స్థాయిలో లాభాలు చేకూర్చి పెట్టడం కోసం భారతదేశంలోని అడవులను చేజిక్కించుకు నేందుకు, వాటిని నియంత్రించేందుకు వీలు కల్పించడమే ఈ సవరణల ఉద్దేశం. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు గ్రామ సభలు, గిరిజన సంఘాలు మరియు అటవీ భూమిని మళ్లించ డానికి ముందస్తు సమ్మతి తప్పనిసరి అయిన ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల హక్కులను హరిస్తు న్నాయి. ఇది గిరిజన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హామీలను నిర్లజ్జగా ఉల్లంఘించడమే. అందు వల్ల ఈ నిబంధనలను వెంటనే ఉపసంహరిం చుకోవాలి.
నిరాధార ఆరోపణలకు ఖండన
భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై అధికార బీజేపీ చేసిన పనికిమాలిన, నిరాధారమైన ఆరోపణలను పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. అన్సారీ ప్రపంచవ్యాప్తంగా గౌరవనీ యులైన దౌత్యవేత్త, మేధావి. మచ్చలేని మనిషి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిం చారు. అన్సారీకి ఉన్న గుర్తింపు, భారత రాజ్యాంగం, లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ పట్ల ఆయనకు ఉన్న తిరుగులేని నిబద్ధత వల్లే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు.
75 ఏండ్ల భారత స్వాతంత్య్రం
మన లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ రిపబ్లిక్‌ను, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర హక్కులు, పౌర హక్కుల పరిరక్షణకు ఆగస్టు 1 నుంచి 15 వరకు విస్తతమైన కార్యక్రమాలు నిర్వహించాలని యావత్ పార్టీ శ్రేణులకు పొలిట్ బ్యూరో పిలుపునిస్తోంది.
పౌర హక్కులపై పెరుగుతున్న దాడులు
తీస్తా సెతల్వాద్, జుబేర్ మహ్మద్ తదితరులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. అసమ్మతిని అణచివేయడమే లక్ష్యంగా ఈ అరెస్టులు జరుగుతున్నాయి. హిందూత్వ శక్తులు, ద్వేషం, హింసతో కూడిన వాతావరణాన్ని సష్టించేందుకు ప్రచారంలో పెడుతున్న నకిలీ వార్తల బండారాన్ని ప్రజల ముందుంచే వారిని బీజేపీ ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం పెరిగిపోతోంది. ద్వేషపూరిత ప్రసంగాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోరు కానీ, వ్యతిరేకించిన వారిని మాత్రం వెంటాడి వేధించుకుతింటున్నారు. ఉన్మాదాన్ని రెచ్చగొట్టే శక్తులతో అధికారికంగా కుమ్మక్కవడాన్ని తక్షణమే ఆపాలి.
నిరుద్యోగం
2022 జనవరి - ఏప్రిల్ త్రైమాసికానికి సంబం ధించిన సీఎంఐఈ నివేదిక ప్రకారం 20-24 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగుల సంఖ్య 2 కోట్లకు పైగా ఉంది. అంటే నిరుద్యోగిత రేటు దిగ్భ్రాంతి గొలిపే రీతిలో 42 శాతానికి చేరింది. 25-29 ఏండ్ల వయో గ్రూపులో నిరుద్యోగులు అరవై లక్షల కంటే ఎక్కువ. అంటే వీరిలో నిరుద్యోగిత రేటు 12.72 శాతం అన్నమాట. ఉద్యోగాల కోసం చురుగ్గా వెతుకుతున్న 15 ఏండ్ల పైబడిన 3 కోట్ల మంది నిరుద్యోగ భారతీయుల్లో దాదాపు 80 శాతం మంది 20-29 ఏండ్ల వయో గ్రూపునకు చెందినవారే ఉన్నారు. భారతదేశంలో పని వయసు కలిగినవారు మొత్తం జనాభాలో 36 శాతం. ఉద్యోగాలు లేవని తెలిసి వీరిలో 61.2 శాతం మంది ఉపాధి వేట మానేశారు. కార్మిక భాగస్వామ్య రేటు ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి అంటే 38.8 శాతానికి పడిపోయింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
ఇప్పటికే నరేగా కింద పనిచేసి కూలీలకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేయాలి. కోట్లాది మంది గ్రామీణ యువత ఉపాధికి, జీవనోపాధికి ఇదే ఏకైక ఆధారం కాబట్టి నరేగాకు కేటాయింపులు గణనీయంగా పెంచాలి.
కేరళ అభివద్ధి
కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని అస్థిరపరి చేందుకు జరుగుతున్న కుతంత్రాలను పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తోంది. కేరళ ప్రజల విశ్వాసాన్ని చూరగొని 2021లో మరోసారి భారీ తీర్పు ద్వారా ఏర్పడిన ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్,బీజేపీ కూడబలుక్కుని కుతంత్రాలు సాగిస్తున్నాయి.
విధ్వంసకర వరదలు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసంపై పొలిట్ బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అసోంలో వరదలు చాలా మంది ప్రాణాలను బలిగొన్నాయి, ఆస్తు లను నాశనం చేశాయి లక్షలాది మంది ప్రజలను నిరా శ్రయులను చేశాయి. అలాగే తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వరదలు బీభత్సం సష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బాధిత రాష్ట్రాలకు సహాయం, పునరావాసం కోసం అవసర మైన వనరులు, సామగ్రిని అందజేయాలి.