Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఏఎస్ అధికారిణి, అమిత్ షా ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేసిన సినీ దర్శకుడు.. అవినాశ్ దాస్‌ను అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు
న్యూఢిల్లీ : బాలీవుడ్ దర్శకుడు అవినాశ్ దాస్ (46)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసున్నప్పటి ఫొటోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశాడన్న ఆరోపణలపై గుజరాత్ పోలీసులు అవినాశ్ దాస్‌ను అరెస్టు చేశారు. తదుపరి న్యాయపరమైన చర్యల కోసం అతడ్ని పోలీసులు ముంబయి నుంచి అహ్మదాబాద్ తరలించారు. కాగా, అమిత్ షా, ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ కలిసున్న ఆ ఫొటో ఇటీవలిదేనని, పూజా సింఘాల్ అరెస్ట్ (మనీలాండరింగ్ కేసులో) కావడానికి కొన్ని రోజుల ముందుదని దర్శకుడు అవినాశ్ దాస్ క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. అయితే ఆ ఫొటో 2017నాటిదని వెల్లడైంది. దాంతో అవినాశ్ దాస్‌పై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఐపీసీ 469(ఫోర్జరీ), జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టం, ఐటీ చట్టం కింద అభియోగాలు మోపారు. అమిత్ షా ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ విధమైన ఫొటోను పోస్టు చేశాడని క్రైమ్ బ్రాంచ్ భావిస్తోంది. ఈ కేసులో అవినాశ్ దాస్‌కు ముందస్తు బెయిల్ లభించలేదు. సెషన్స్ కోర్టు అతడి పిటిషన్‌ను తిరస్కరించింది. తనను అహ్మదాబాద్ తరలించకుండా చూడాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, సదరు ఫిలిం మేకర్‌కు అక్కడా నిరాశ తప్పలేదు. అవినాశ్ దాస్ 2017లో స్వరా భాస్కర్, సంజరు మిశ్రా, పంకజ్ త్రిపాఠీలతో 'అనార్కలీ ఆఫ్ ఆరా' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.