Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నేపాల్‌దేవ్ భట్టాచార్య, ఆర్.లక్ష్మయ్య ఎన్నికయ్యారు. జులై 16 నుంచి 18 వరకు హర్యానాలో హిస్సార్‌లో ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ 11వ జాతీయ మహాసభలు జరిగాయి. అసంఘటిత రోడ్డు రవాణా కార్మికులకు సామాజిక భద్రతా చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహాసభ తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మూడు రోజుల చర్చల ముగింపు సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె.కె.దివాకరన్ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై సమాధానమిచ్చారు. ప్రధాన కార్యదర్శి నివేదికను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రవాణా రంగ పరిశ్రమను పరిరక్షించడంతో పాటు కార్మికుల సంక్షేమం కోసం వచ్చే మూడేండ్ల కు రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసింది.
135 మందితో జనరల్ కౌన్సిల్
ఈ మహాసభ 135 మందితో జనరల్ కౌన్సిల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అందులో 110 మంది వర్కింగ్ కమిటీ సభ్యులుకాగా, 35 మంది ఆఫీస్‌బేరర్లుగా ఎన్నుకోబడ్డారు. అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులుగా నేపాల్‌దేవ్ భట్టాచార్య, ఆర్. లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కె.కె.దివాకరన్, కోశాధికారిగా కె.హరికృష్ణన్ ఎన్నికయ్యారు. ఆఫీస్ బేరర్లుగా తెలంగాణ నుంచి విఎస్ రావు, ఆంధ్ర ప్రదేశ్ నుంచి ముజఫర్ అహ్మద్ ఎన్నికయ్యారు. వర్కింగ్ కమిటీ సభ్యులుగా తెలంగాణ నుంచి పి. శ్రీకాంత్, పిఆర్ రెడ్డి, జె. ఉపేందర్, కె. మల్లేశం ,ఏపీ నుంచి సిహెచ్ సుందరయ్య, ఎన్.శివాజి, జి. శ్రీనివాసులు, సురేష్, ప్రభాకర్‌లు ఎన్నికయ్యారు. జనరల్ కౌన్సిల్ సభ్యులుగా తెలంగాణ నుంచి సిహెచ్ రాంచందర్, మహబూబ్ పాషా, ఏపీ నుంచి సత్యనారాయణ, ఎం.పోలినాయుడు, కె. దుర్గారావు, ఎస్కె రఫీ, వెంకటేశ్వర్లు, ఎస్కె రియాజ్, ఎస్కె. జిలాని ఎన్నికయ్యారు.