Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హౌం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్
న్యూఢిల్లీ:ఉపా కేసుల్లో 2016 నుం చి 2020 వరకు 24,134 మంది విచా రణలో ఉన్నారని కేంద్ర హౌం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. సీపీఐ(ఎంౠ రాజ్యసభ ఎంపీ ఎఎ రహీమ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఐదేండ్లలో 5,027 యూఏపీఏ కేసులు నమో దు చేసినట్లు చెప్పారు. అందులో 24,134 మంది విచారణలో ఉండగా, 212 మంది దోషులుగా తేలారని చెప్పారు. 386 మంది నిర్దోషులని పేర్కొన్నారు.
నల్లమల అడవిలో యురేనియం మైనింగ్ అనుమతి లేదు:కేంద్రం
నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్ అనుమతులు ఇవ్వలేదని పీఎంఓ కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అదేవిధంగా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతం,కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాలోనూ అనుమతి లేదని వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.