Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ప్రధానమంత్రి మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఈ నెల16 ప్రారంభించారు. రూ.14,850 కోట్లతో ఈ ఎక్స్ప్రెస్ వేను గడవు కంటే 8 నెలల ముందే పూర్తి చేసినట్టు ఘనంగా ప్రకటించారు. అయితే ప్రారంభించిన ఐదు రోజులకే కొద్దిపాటి వర్షానికి అనేక చోట్ల రోడ్డు ధ్వంసమైంది. రోడ్డు ధ్వంసమైన ఫోటోలను సోషల్ మీడియాలో స్థానికులు షేర్ చేస్తున్నారు.