Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు (ఎన్పీ) పథకంలో చేర్చడానికి అర్హతలేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. పెట్టుబడి అనుమతులు (ఎన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) లేనందున కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టులో చేర్చలేమని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2016 ఫిబ్రవరి, 2018 డిసెంబర్లో రెండు సార్లు కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు పథకంలో చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరినట్టు తెలిపారు. అయితే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేనందున అది సాధ్యపడదని చెప్పారు.
ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టును బోర్డులకు అప్పగించలే
ఇక 2021 జూలై 15న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్-2లో ఉన్న కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను సంబంధిత బోర్డులకు అప్పగించాల్సి ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇంతవరకు అప్పగించలేదని కేంద్ర మంత్రి తెలిపారు.