Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదో రోజు పార్లమెంట్లో ఆందోళన
- ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీలు పట్టు
న్యూఢిల్లీ. ధరలు పెరుగుదలపై ప్రతిపక్షాల ఆందోళన ఐదో రోజు కూడా కొనసాగింది. పార్లమెంటు ఉభయ సభల్లో ధరల పెరుగుదలపై చర్చకు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేబూని నినాదాల హౌరెత్తించారు. ఉభయ సభల్లో సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. దీంతో సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ధరల పెరరుగుదలపై ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఉభయసభలు స్తంభించాయి. శుక్రవారం లోక్సభ ప్రారంభం కాగానే పెంచిన ధరలు , ద్రవ్యోల్బణం , జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్లకార్డులతో ప్రతిపక్ష ఎంపిలు ఆందోళ చేపట్టారు. వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులు పట్టుకొని నినాదాల హౌరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. ధరలు పెరుగుదలపై చర్చించాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే నేత టిఆర్ బాలుతో పాటు ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా ససేమిరా అనడంతో తమ ఆందోళన కొనసాగించారు. కేవలం 12 నిమిషాలు పాటు మాత్రమే జరిగిన సభ ప్రతిపక్షాల ఆందోళనతో మద్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్ష ఎంపీలు వెల్ తమ ఆందోళన కొసాగించారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వెనక్కి తీసుకోవాలని నినాదాలు ఇచ్చారు. వివిధ అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులను ప్యానల్ స్పీకర్ కీర్తి ప్రేమ్జీభారు సోలంకి తిరస్కరించారు. ప్రతిపక్షాల ఆందోళనతో సభ 11 నిమిషాల పాటు జరిగి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 'ది ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు-2022ను చర్చకు పెట్టారు. జయంత్ సిన్హా (బీజేపీ), భర్తృహరి మెహతాబ్ (బీజేడీ) బిల్లుపై మాట్లాడారు. కాంగ్రెస్ నేత రంజాన్ చౌదరి మాట్లాడుతూ బిజినెస్ అడ్వజరీ కమిటీ (బీఏసీ)లో చర్చించిన అంశాలు కాకుండా, కొత్తగా సభ కార్యకలాపల ఎజెండాలోకి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రతిపక్షాలతో చర్చించకుండా తీసుకురావడమేంటని ప్రశ్నించారు. దీన్ని వ్యతిరేకిస్తూ తాము సభను వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రతిపక్షాలు లేకుండా బిల్లును ముజువాణి ఓటుతో ఆమోదించారు. కేవలం 37 నిమిషాల్లోనే బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సభను సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్యానల్ స్పీకర్ రాజేంద్ర అగర్వల్ ప్రకటించారు.
మరోవైపు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. సభలో ప్లకార్డు ప్రదర్శించకూడదని చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆదేశించారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డు పట్టుకొని నినాదాల ఇచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ ప్రారంభమైన ఏడు నిమిషాలకే వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేస్తూ చైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్ష ఎంపీలు వెల్లో ఆందోళన కొనసాగించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ చేపట్టారు. అనంతరం సభను మధ్యాహ్నం 2్ణ30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రయివేట్ మెంబర్ బిల్లు బిజినెస్ జరిగింది. సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్ చిన్నారులకు ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం, రాజ్యాంగ సవరణ అంశాలపై ప్రయివేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. దేశ ప్రయోజనాల రీత్యా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు సంబంధించిన ప్రయివేట్ మెంబర్ బిల్లును, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 246, 254 సవరణకు సంబంధించిన ప్రయివేట్ మెంబర్ బిలును సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా ప్రవేశపెట్టిన ఆరోగ్య హక్కుకు సంబంధించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ జరిగింది. అనంతరం సాయంత్రం 5్ణ12 గంటల వరకు ప్రత్యేక ప్రస్తావన కొద్ది సేపు జరిగి సభ సోమవారం మద్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.