Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల సంక్షేమం కోసం ఏది అవసరమో నిర్ణయించుకోవాలి
- పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం
- శాంతి, సామరస్యం విలువే అత్యుత్తమం
- అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి ఇంకా చాలా చేయాలి
- వీడ్కోలు సభలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
న్యూఢిల్లీ : జాతీయ ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎదగాలనీ, ప్రజల సంక్షేమం కోసం ఏది అవసరమో నిర్ణయించుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజకీయ పార్టీలను కోరారు. శనివారం నాడిక్కడ పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో సేవ చేసేందుకు తనకు అవకాశం కల్పించినందుకు పౌరులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు ''ప్రజాస్వామ్య దేవాలయం'' అని, పార్లమెంట్ లో చర్చల సమయంలో గాంధేయ తత్వాన్ని ఉపయోగించాలని పార్టీలను కోరారు. శాంతి, సామరస్యం విలువను ఆయన మరింత నొక్కిచెప్పారు. ఎంపీలు తమ లక్ష్యాలను సాధించడానికి హక్కు కలిగి ఉన్నారనీ0, అయితే వారి పద్ధతులు గాంధేయవాదంగా ఉండాలని అన్నారు. 'పార్లమెంటులో చర్చ, అసమ్మతి హక్కులను వినియోగించుకునేట ప్పుడు ఎంపీలు ఎల్లప్పుడూ గాంధీతత్వాన్ని అనుసరించాలి'' అని సూచించాలన్నారు. పార్ల మెంటు సభ్యులతో కూడిన పెద్ద కుటుంబంలో తనను తాను ఎప్పుడూ ఒక భాగంగా భావించేవాడినని అన్నారు. ''దేశం మొత్తాన్ని ఒక కుటుంబంగా పరిగణించి నప్పుడు, ఏ కుటుంబానికైనా కొన్ని సమయాల్లో విభేదాలు ఉండవచ్చు. అలాంటి విభేదాలను చర్చలతో శాంతియుతంగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవచ్చు. దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలి'' అని అన్నారు.
అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి ఇంకా చాలా చేయాలి
ప్రభుత్వాల కృషిని వెనక్కి తిరిగి చూసు కుంటే, అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాల పెంపునకు ఇంకా చాలా సాధించాల్సింది ఉందని, ఇంకా చాలా చేయాల్సి ఉందని రాష్ట్రపతి అన్నారు. అంబేద్కర్ కలలను దేశం నిదానంగా కానీ కచ్చితంగా సాకారం చేస్తోందని పేర్కొన్నారు. తాను మట్టి ఇంట్లో పెరిగానని, అయితే చాలా తక్కువ మంది పిల్లలు ఇప్పుడు లీకేజీలతో ఉన్న గడ్డి ఇళ్లలో నివసిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రత్యక్ష సహకారంతో ఎక్కువ మంది పేదలు పక్కా ఇళ్లకు మారుతున్నారని చెప్పారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య విందు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు మర్యాద పూర్వక విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి నివాసం లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య సతీమణి ఉషమ్మ, కుమారుడు హర్షవర్ధన్‌లతో కలిసి తెలుగు వంటకాలతో విందు ఆరగించారు. రాష్ట్రపతిగా ఐదేండ్ల పదవీ కాలాన్ని రామ్‌నాథ్ కోవింద్ ఎంతో హుందాగా నిర్వహించా రన్న ఉపరాష్ట్రపతి.. వివిధ కీలక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు వారి చక్కని పని తీరుకు నిదర్శనంగా నిలిచింద న్నారు. వారితో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న వెంకయ్య.. కోవింద్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమైనదని అన్నారు. ఆయన ఆలోచనలు, సందేశాలు, ప్రసంగాల నుంచి ఈ తరం యువత ఎంతో నేర్చుకోవలసి ఉందన్నారు. వారి భవిష్యత్ జీవితం ఆరోగ్యకరంగా, అర్ధవంతంగా సాగాలని ఆకాంక్షించారు.