Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాణా సంచా పేలి ఆరుగురు మృతి
పాట్నా : బీహార్‌లో బాణా సంచా వ్యాపార వేత్త ఇంట్లో మందుగుండు సామాగ్రి పేలి ఆరుగురు మృతి చెందారు. ఇంట్లో కొంత భాగం కూలిపోయింది. ఈ శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన సరాన్ జిల్లా ఖైరా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఖుదాయి భగ్లో ఆదివారం చోటుచేసుకుంది. వ్యాపారవేత్తను సుఖ్బీర్ హుస్సేన్‌గా గుర్తించారు. పేలుడు ధాటికి ఇంట్లోని కొంత భాగం దగ్దం కాగా, మిగిలిన భాగం మంటల్లో చిక్కుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నారని, బాణా సంచా పేలడంతో ఒక్కసారి భారీ శబ్దాలు వచ్చాయని, సుమారు గంట పాటు పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయని తెలిపారు. ఇల్లు నది ఒడ్డున ఉందని, ఇంటి ప్రధాన భాగం కూలిపోయిందని చెప్పారు.