Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గోవాలో అనుమతులు లేకుండా అక్రమంగా బార్, రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు తన కుమార్తె జోయిష్ పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయాన్ని శనివారం నాడే మీడియా సమావేశంలో వెల్లడించిన ఆమె ఆదివారం నోటీసులు పంపారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేష్, నెట్టా డిసౌజాలకు ఈ నోటీసులు పంపారు. తన కుమార్తెపై చేసిన ఆరోపణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఆమెకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ కోరారు. కాగా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బివి శ్రీనివాస్ ఆ బార్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.