Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. మిగిలిన మూడు కేసులు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రిందట జ్వరం, చర్మ సంబంధ సమస్యలతో లోక్ నాయక్ జైప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్జెపి) ఆసుపత్రిలో చేరిన 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థలో శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. బాధితుడికి లోక్‌నాయక్ ఆసుపత్రిలోనే ప్రత్యేక ఐసోలేషన్ విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడానే ఉందని పేర్కొంది. బాధితుడితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని కూడా పేర్కొంది.