Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్ల పదవీ కాలంలో శక్తిమేర బాధ్యతలు నిర్వర్తించా
- వీడ్కోలు ప్రసంగంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆదివారం జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. తన ఐదేండ్ల పదవీకాలంలో శక్తిమేరకు బాధ్యతలు నిర్వర్తించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను గుర్తుకు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదన్నారు. తాను సాధారణ పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చానన్నారు. ఒక సామాన్యుడు అత్యున్నత పదవిని పొందడం ప్రజాస్వామ్యంలోనే సాధ్యమవుతుందని చెప్పారు. యూపీలోని పరౌంఖ్ గ్రామానికి చెందిన కోవింద్ ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే.. అందుకు కారణం ప్రజాస్వామ్య సంస్థలే కారణమన్నారు. సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం మనగడ సాగించలేదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వసించారన్నారు. రాష్ట్రపతిగా తాను పదవిలో ఉండగా కాన్పూర్లోని తన ఉపాధ్యాయుల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం తన జీవితంలో మరిచిపోలేని క్షణాలన్నారు. వాతావరణంలో మార్పులతో నెలకొన్న సంక్షోభం భూమి భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాల కోసం పర్యావరణం, భూమి, గాలి, నీటిని కాపాడుకోవాలని సూచించారు. దేశ ప్రజలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ కతజ్ఞతలు తెలిపారు.