Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈశాన్య రాష్ట్రాల్లో 1.5లక్షల మంది వినియోగదారులకు ఇక్కట్లు
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేసే ట్రాన్స్పోర్టర్స్ సమ్మెకు దిగారు. చమరు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తమకు చెల్లిస్తున్న రవాణా ఛార్జీలను పెంచాలని నార్త్ ఈస్ట్ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవటం లేదని దాంతో సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని తెలిపింది. దీనివల్ల అసోం, మణిపూర్, నాగాలాండ్ రాష్టాల్లో దాదాపు 1.5లక్షల మంది వినియోగదారులపై ప్రభావం పడనున్నది. ఈ సమ్మెలో ట్రక్ యజమానులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వంటగ్యాస్ సిలిండర్లను అందించే 8 బాట్లింగ్ ప్లాంట్లు మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ బాట్లింగ్ ప్లాంట్ల వద్ద నుండి సిలిండర్లను ట్రక్క్లలో తరలిస్తారు. ట్రాన్స్పోర్టర్స్ సమ్మె కారణంగా మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్ సరఫరా స్తంభించిపోనున్నది.