Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం మొత్తం రుణం రూ.155 లక్షల కోట్లు
- జీడీపీలో 60 శాతం అప్పే
- ప్రతి ఏటా పైపైకే.. మూడు నెలల్లో 3.74 శాతం పెరిగిన అప్పు : కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి
న్యూఢిలీ: 2022-23 బడ్జెట్ అంచనాల్లో దేశం అప్పు రూ.155.33 లక్షల కోట్లని, అది జీడీపీలో 60.2 శాతమని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్సభలో ఎంపీలు ఎస్యు తిరునవక్కరసర్, రవనీత్ సంగ్ బిట్టు, కళానిథి వీరాస్వామి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వ సమాధానం ఇచ్చారు. పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్పై త్రైమాసిక నివేదిక దేశం అప్పుడు 2021 డిసెంబర్ చివరి నాటికి రూ.128.41 లక్షల కోట్ల నుంచి 2022 మార్చి చివరి నాటికి రూ.133.22 లక్షల కోట్లకు పెరిగిందని, అప్పు దాదాపు 3.74 శాతం పెరుగుదల ఉందని తెలిపారు.
సంవత్సరం అప్పు (రూ.లక్షల కోట్లలో) జీడీపీలో శాతం
2018-19 92.50 49.0
2019-20 105.23 52.4
2020-21 122.05 61.6
2021-22 138.88 58.7
2022-23 155.33 60.2
అప్పుల్లో తమిళనాడు ప్రథమం..రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్
ఎనిమిదో స్థానంలో ఏపీ
రాష్ట్రాల అప్పుల్లో తమిళనాడు అగ్రభాగంలో నిలిచింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలవగా, ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఎంపీ కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2022 బడ్జెట్ అంచన బట్టీ ఆయా రాష్ట్రాల్లో అప్పులను అందులో పేర్కొన్నారు. అప్పుల్లో తమిళనాడు రూ. 6,59,868.9 కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ. 6,53,307.5 కోట్లు, మహారాష్ట్ర రూ. 6,08,999.7 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.5,62,697.2 కోట్లు, రాజస్థాన్ రూ.4,77,177.2 కోట్లతో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కర్నాటక రూ.4,62,832.8 కోట్లు, గుజరాత్ రూ.4,02,785.4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.3,98,903.6 కోట్లు, కేరళ రూ.3,35,989.1 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.3,17,736.8 కోట్లు, తెలంగాణ రూ.3,12,191.3 కోట్లు, పంజాబ్ రూ.2,82,864.6 కోట్లు, హర్యానా రూ. 2,79,022.8 కోట్లు, బీహార్ రూ. 2,46,413.5 కోట్లు, ఒడిశా రూ. 1,67,205.8 కోట్లు, జార్ఖండ్ రూ.1,17,789.8 కోట్లు, చత్తీస్గడ్ రూ.1,14,200.8 కోట్లు, అసోం రూ.1,07,719.5 కోట్లు, ఉత్తరాఖండ్ రూ.84,288.7 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ రూ.74,686.4 కోట్లు, గోవా రూ.28,509.9 కోట్లు, త్రిపుర రూ.23,624.5 కోట్లు, మేఘాలయ రూ.15,125 కోట్లు, నాగాలాండ్ రూ.15,620.8 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ రూ.15,122.6 కోట్లు, మణిపూర్ రూ.13,510.6కోట్లు, మిజోరాం రూ. 11,830.4 కోట్లు, సిక్కిం రూ.11,285.3 కోట్లు అప్పుల్లో ఉన్నాయి.