Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్ ప్రభుత్వానికి తెలిపిన అమర్త్యసేన్ కుటుంబ సభ్యుడు
న్యూఢిల్లీ : ఉపాధ్యాయుల నియామక కుంభకోణం మమత బెనర్జీ సర్కార్కు పెద్ద తలనొప్పిగా మారింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అత్యున్నత పురస్కారం 'బంగాబిభూషణ్' అవార్డుల బహూకరణ కార్యక్రమంపైనా అవినీతి కుంభకోణం ప్రభావం పడింది. మమత సర్కార్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవేళ ఈ అవార్డును తీసుకోవడానికి పురస్కార గ్రహీతలు అంత సుముఖంగా లేరని తెలిసింది. అవార్డు స్వీకరణకు తాను హాజరు కావటం లేదని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ తాజాగా వెల్లడించారు. బంగాబిభూషణ్కు అవార్డుకు ఎంపికయ్యాక, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జులై మొదటివారంలో అమర్త్యసేన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో అమర్త్యసేన్ మాట్లాడుతూ,అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి తాను రావటం లేదని, ఆ సమయంలో తాను కోల్కతాలో ఉండటం లేదని తెలిపారట. ప్రస్తుతం అమర్త్యసేన్ యూరప్ పర్యటనకు వెళ్లారని కుటుంబ సభ్యులు ఒకరు మీడియాకు తెలిపారు. వివిధరంగాల్లో ప్రముఖులకు బెంగాల్ ప్రభుత్వం ప్రతిఏటా'బంగాబిభూషణ్' పురస్కారాలను ప్రకటిస్తోంది.అయితే మమత సర్కార్ అవినీతి,అక్రమాల్లో కూరుకుపో యిందని సీపీఐ(ఎం) నాయకుడు సుజాన్ చక్రవర్తి విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ రాష్ట్రవ్యా ప్తంగా జరుగుతున్న ధర్నాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మమత సర్కార్లోని కీలక మంత్రి అవినీతి బండారం బయటపడింది. ఇలాంటి ప్రభుత్వం చేతుల మీదుగా బంగాబి భూషణ్, ఇతర పురస్కారాలు స్వీకరించవద్దు'' అంటూ ఆయ న అవార్డు గ్రహీతలను కోరారు. ఈనేపథ్యంలో అవార్డు బహూకరణ కార్యక్రమానికి అమర్త్యసేన్ దూరంగా ఉన్నారని వార్తలు వెలువడ్డాయి.