Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లఖింపూర్ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌పై జులై 15న వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టులోని లక్నో ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. గత ఏడాది అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడుగా కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ రోజు నిరసన చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన దుర్ఘటనలో నలుగురు రైతులు సహా మొత్తం 8మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో గతేడాది అక్టోబర్ 9న అరెస్టయిన ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరుచేసింది. దీనిని సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా..ఆశిష్ బెయిల్‌ను రద్దు చేసింది. కేంద్రమంత్రి కుమారుడు అయినందున కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశముందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. బాధితులు వ్యక్తం చేసిన విషయాల్ని పరిగణలోకి తీసుకొని లక్నో బెంచ్ బెయిల్ పిటిషన్‌పై మళ్లీ విచారణ జరిపింది. కేసు విచారణను ప్రభావితం చేయవచ్చునని భావించింది. దాంతో ఆశిష్‌కు బెయిల్ ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది.