Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.45 లక్షల కోట్ల బిడ్డింగ్‌లు
న్యూఢిల్లీ : తొలి రోజు జరిగిన 5జి స్పెక్ట్రం వేలంలో రూ.1.45 లక్షల కోట్ల విలువ చేసే బిడ్డింగ్‌లు నమోదయ్యాయని టెలికం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ వేలంలో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, అదానీ డాటా నెట్వర్స్ కంపెనీలు పాల్గొన్నాయని మంత్రి మీడియాకు తెలిపారు. ఆగస్టు 15 నాటికి కేటాయింపులు పూర్తి కానున్నాయన్నారు. 2022 ముగింపు నాటికి అనేక నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. తొలి రోజు నాలుగు రౌండ్లలో వేలం జరిగింది. జులై 27న ఐదో రౌండ్ జరగనుంది. టెల్కోలు ప్రధానంగా మిడ్ బ్రాండ్ స్పెక్ట్రంపై దృష్టి సారించారు. ఈ వేలంలో విక్రయానికి రూ.4.31 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెట్జ్ల స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి పెడుతున్నారు. వేలానికి 10 ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 600, 700, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్ కనిష్ట స్థాయిలో ఉంది. మధ్యస్థ స్పెక్ట్రంలో 3.3-3.6 గిగాహెట్జ్, గరిష్ఠంగా 26 గిగాహెట్జ్ను కేటాయిస్తుంది. 4జి కంటే 10 రెట్ల వేగంతో 5జి పని చేయనుంది.