Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యశ్వంత్ సిన్హా
ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా, ఆయన మంగళవారం మీడియాతో మాట్లా డుతూ.. ఇకపై తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, ఇండిపెండెంట్ గానే ఉంటానని చెప్పారు. ఇకపై ప్రజా జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సిన్హా అన్నారు. 84 ఏండ్ల వయసులో తాను ఎంత యాక్టివ్గా ఉంటాననే విషయం ముఖ్యమని చెప్పారు. ఎంత కాలం తనలో శక్తి ఉంటుందో చూడాలని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదనీ, తాను కూడా ఎవరితో మాట్లాడలేదని చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల టీఎంసీకి చెందిన ఒక నేతతో టచ్లో ఉన్నానని తెలిపారు.