Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా
న్యూఢిల్లీ :విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారనీ, దీనివల్ల నేతల మధ్య భయం పెరిగిందనీ, బీజేపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నదని తీవ్ర స్థాయిలో విమర్శలుచేశారు. 'బిగ్ బ్రదర్(మోడీనుద్దేశించి) అంతా గమనిస్తున్నారు. తమ మాటలు వింటున్నారనే భయం పార్టీలకు అతీతంగా విస్తరిస్తోంది. ఈ తరహా భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంది' అని ట్వీట్ చేశారు. అలాగే బీఎస్ఎన్ఎల్ను ట్యాగ్ చేస్తూ.. తన కాల్స్‌ను మళ్లిస్తున్నారని ఆరోపించారు. 'తాజాగా బీజేపీకి చెందిన కొందరు స్నేహితులతో మాట్లాడాను. ఆ తర్వాత నుంచి నా ఫోన్‌కు వచ్చే అన్ని కాల్స్ డైవర్ట్ అవుతున్నాయి. నాటి నుంచి నేను కాల్ చేసుకోలేకపోతున్నాను. నాకు ఎవరి నుంచి ఫోన్ రావడం లేదు. మీరు నా సమస్యను పరిష్కరించాలి' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై బీఎస్ఎన్ఎల్ వెంటనే స్పందించిందని టెలికాం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.