Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి కేసులో మిజోరం ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు
ఐజ్వాల్(మణిపూర్):అభివృద్ధి పను లకోసం ప్రత్యేక సహాయ నిధి నుంచి డబ్బును ఉపసంహరించు కుని అక్రమా లకు పాల్పడిన కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మిజోరం ప్రత్యే క కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అవినీ తి కేసులో మిజోరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే బుద్ధధన్ చక్మాతో పాటు మరో 12 మంది నేతలకు ప్రత్యేక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2013, 2018 మధ్యకాలంలో చక్మా అటానమ స్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌కు చెందిన రూ.1.37 కోట్లను దుర్వినియోగం చేసినందుకు గాను శాసనసభ్యుడితో సహా 13 మందికి ప్రత్యేక న్యాయమూర్తి వన్లాలెన్మావి యా ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. అవినీతి నిరోధక చట్టం 1988 లోని సెక్షన్ 13(1) (డి) ప్రకారం వారి అధికారాలను దుర్వినియోగం చేసి, అభివృద్ధి నిధులను దుర్వినియోగం చేశారని కోర్టు వారిని ఈ నెల 22న దోషులుగా నిర్ధారించింది. మంగళవారం శిక్ష ఖరారు చేసింది. ఇందుకు సంబంధిం చి 2018లో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. చక్మా తరువాత కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి లాల్ థన్హావ్లా ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నలుగురు విద్యార్థులకు మెడికల్ సీట్లు నిరాకరించడాన్ని నిరసిస్తూ 2017లో రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రానికి చెందిన తొలి బీజేపీ ఎమ్మెల్యే చక్మానే కావడం గమనార్హం.