Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి
- రెండో రోజు కొనసాగిన మహాపడవ్
-సీపీఐ(ఎం) ఎంపీల సంఘీభావం
- రైతు, మహిళ సంఘాలు మద్దతు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ అంగన్ వాడీ వ్యతిరేకి అంటూ నినాదాలు హోరెత్తాయి. పెన్షన్, గ్రాట్యూటీ ఇవ్వాలన్న డిమాండ్లతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గర్జించారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఏఐఎఫ్ ఏడబ్ల్యూహెచ్) అంగన్వాడీ అధికార్ మహా పడవ్ దేశ రాజధానిలో రెండో రోజు బుధవారం కొనసాగింది. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు, కేరళ వరకు, గుజరాత్ నుంచి అసోం వరకు దేశం నలుమూలల నుంచి 22 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహా యకులు మహాపడవ్లో పాల్గొన్నారు. మహాపడవ్లో సీపీఐ(ఎం) ఎంపీలు ఎఎం ఆరీఫ్, వి.శివదాసన్, ఎఎ రహీం పాల్గొని సంఘీభావం తెలి పారు. పార్లమెంటులో అంగన్వాడీల సమస్యలను లేవనెత్తుతామని హామీ నిచ్చారు. ఏఐకేఎస్ జాతీయ అధ్య క్షులు అశోక్ ధావలే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. రైతుల తరపున ఏఐకేఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మహిళలు చేసే ఈ ఉద్యమానికి తమ సంఘం మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఆల్ ఇండియా మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జై భగవాన్ ప్రసంగిస్తూ స్కీమ్ వర్కర్లు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.