Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు 5జి స్పెక్ట్రం వేలం కొనసాగింపు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద స్పెక్ట్రం 5జికి వేస్తున్న వేలంలో తొలి రోజుతో పోల్చితే రెండో రోజూ పెద్ద బిడ్డింగ్‌లు ఏమీ రాలేదని తెలుస్తోంది. బుధవారం తొమ్మిదో రౌండ్ ముగింపు వరకు రూ. 1,49,454 కోట్ల బిడ్లు నమోదయ్యాయని టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అన్ని బ్రాండ్లకు వేలంలో మంచి పోటీ నెలకొన డం సంతోషంగా ఉందన్నారు. గురువారం కూడా 5జి స్పెక్ట్రం వేలం కొనసాగనుందన్నారు. అన్ని బ్రాండ్లకు డిమాండ్ నెలకొందన్నారు. తొలి రోజు జరిగిన నాలుగు రౌండ్లలో రూ.1.45 లక్షల కోట్ల కు బిడ్డిం గ్లు వచ్చాయి. రెండో రోజు ఈ వేలంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, గౌతమ్ అదానీకి చెందిన అదానీ డేటా నెట్వర్క్స్, నవీన్ మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్టెల్ మధ్య పోటీ నెలకొనగా వొడాఫోన్ ఐడియా కూడా భారీగానే స్పెక్ట్రం కొనుగోలుకు ముందుకు వచ్చిందని తెలుస్తోంది.