Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. బీఎస్ఎన్ఎల్ సేవల స్థాయిపెంపునకు తాజాగా పెట్టుబడిని సమకూర్చడంపైన, స్పెక్ట్రం కేటాయింపు, లాభనష్టాల ఖాతాపై ఒత్తిడి తగ్గించడం, భారత్ బ్రాడ్ బాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడంతో ఫైబర్‌నెట్‌వర్క్‌ను పెంచడం వంటివి ఉన్నాయి. 4జీ సేవలు అందించడానికి, బీఎస్ఎన్ఎల్కు 900 -1800 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌ను పాలనాపరంగా రూ 44,993 కోట్లతో కేటాయించనున్నారు. ఈక్విటీ సమకూర్చడంతో దీనిని కేటాయిస్తారు. ఈ స్పెక్ట్రమ్ తో బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో పోటీ పడగలుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో విస్తృత నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని హై స్పీడ్ డాటాను అందించగలుగుతుంది. దేశీయంగా సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, బీఎస్ఎన్ఎల్ ఆత్మనిర్భర్ 4జీ టెక్నాలజీ స్టాక్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. వచ్చే నాలుగేండ్లకు అవసరమయ్యే పెట్టుబడి వ్యయం అవసరాలకు ప్రభుత్వం రూ.22,471 కోట్ల నిధులను సమకూరుస్తుంది.
రూ. 26,316 కోట్లతో గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలు
ఐదు రాష్ట్రాల్లో 44 వెనుకబడిన జిల్లాల్లో 7,287 గ్రామాలకు 4 జి మొబైల్ సేవలను అందించేందుకు రూ.26,316 కోట్లను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. మారుమూల ప్రాంతాల్లో బ్రెజిల్లో బిఎ-సెయిల్-11 ప్రాజెక్టు అభివృద్ధి భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ భారత్ పెట్రో రిసోర్సెస్ లిమిటెడ్ అదనపు పెట్టుబడి 1,600 మిలియన్ల యుఎస్ డాలర్లు (సుమారు రూ. 12,000 కోట్లు)కి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.