Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా పాడి రైతులు ఆందోళన
- కేంద్ర మంత్రికి వినతి
- సీపీఐ(ఎం) ఎంపీలు సంఘీభావం
న్యూఢిల్లీ : పాల ఉత్పత్తులు, యంత్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని పాడి రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం డైరీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. జీఎస్టీని తిరస్కరిస్తూ పాల ఉత్పత్తిదారుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన మెమోరాండాన్ని కేంద్ర పశుసంవర్ధక మంత్రి పరషోత్తం రూపాలాకి సమర్పించారు. డీఎఫ్ఎఫ్ఐ ఇచ్చిన పిలుపులో భాగంగా జీఎస్టీని రద్దు చేయాలని, పాల రంగంలో ఎఫ్ఆర్పీని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు స్థానిక మిల్క్ బూత్లు, సహకార సంఘాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, త్రిపుర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి పాల ఉత్పత్తిదారులు తమ తమ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు.రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన పాడి రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్లో పార్లమెంట్ మార్చ్ చేపట్టారు. జీఎస్టీని రద్దు చేయాలనీ, ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఎంపీలు వి.శివదాసన్, ఎఎ రహీం, ఎఎం ఆరీఫ్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ధావలే మాట్లా డుతూ పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ, పాల యంత్రాలపై 18 శాతం జీఎస్టీ.. మోడీ సర్కార్ విధించిందని విమర్శించారు. మోడీ సర్కార్ తీసు కున్న నిర్ణయంతో పాడిరైతులతో పాటు సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని విమర్శించారు. న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ) లేకపోవడం, పచ్చి పశుగ్రాసం ధరలు పెరగడంతో పాటు పాడి రైతులు ఇప్పటికే నష్టాల బారిన పడ్డారని తెలిపారు. జీఎస్టీ విధించడంతో మరిన్ని నష్టాలు వస్తాయని పేర్కొన్నారు. దేశంలో పాల ఉత్పత్తిలో ఉన్న 75 శాతం ఉన్న చిన్న పాడి రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.