Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళన
- రాత్రంతా ఆందోళనే...
-ఆప్ ఎంపీ సంజరు సింగ్ సస్పెండ్
- మొత్తం 20 మంది రాజ్యసభ, నలుగురు లోక్‌సభ సభ్యులపై వేటు
న్యూఢిల్లీ . ప్రతిపక్ష పార్టీలకు చెందిన 19 మంది రాజ్యసభ ఎంపీలు, నలుగురు లోక్‌సభ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 16 ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, టీఆర్ఎస్, ఆర్జేడీ, ఎస్పీ, ఆర్ఎస్పీ, ఎన్సీపీ, డీఎంకె, శివసేన, ఆర్ఎల్డీ, ఐయుఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఎండీఎంకే, వీసీకే తదితర పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారు. టీఎంసీ సభ్యులు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వేరుగా ఆందోళన చేపట్టారు. ఉభయ సభలు ప్రారంభమైన తరువాత సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు గాంధీ విగ్రహం వద్దే ఆందోళన కొనసాగించారు. సస్పెన్షన్‌కు గురైన 20 మంది రాజ్యసభ ఎంపీలు, నలుగురు లోక్‌సభ ఎంపీలు అన్ని ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి. సస్పెన్షన్‌ను రద్దు చేసే వరకు 50 గంటల పాటు పగలు-రాత్రి నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశాయి. అంతకు ముందు ప్రతిపక్ష నేత మల్లికార్జు న ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష ఎంపీలు సమావేశం అయ్యారు. పార్లమెంట్లో వ్యవహరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. ఈ సమావేశంలో అదిర్ రంజన్ చౌదరి, కె.సురేష్ (కాంగ్రెస్), తిరుచ్చి శివ, టిఆర్ బాలు (డీఎంకే), ఎలమారం కరీం (సీపీఐ(ఎం), బినరు విశ్వం (సీపీఐ), సంజరు రౌత్ (శివసేన), జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), మహ్మద్ బషీర్ (ఐయుఎంఎల్), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ), వైకో (డీఎండీకే), హస్నైన్ మసూది (నేషనల్ కాన్ఫరెన్స్) పాల్గొన్నారు. నిబంధన 256(2) ప్రకారం 19 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని తీర్మానం చేయవచ్చని చైర్మెన్ వెంకయ్య నాయుడుకి ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.
24కి పెరిగిన సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య
పార్లమెంట్లో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 24కి చేరింది. సోమవారం నలుగురు లోక్‌సభ సభ్యులు సస్పెండ్ అయ్యారు. మంగళవారం 19 మంది రాజ్యసభ సభ్యులు, బుధవారం మరో రాజ్యసభ సభ్యుడు సస్పెండ్ అయ్యారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెండ్
రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మెన్ ఎం.వెంకయ్య నాయుడు వివిధ ప్రజా సంబంధిత అంశాలపై జోహార్ సర్కార్, మల్లికార్జున ఖర్గే, ఎలమరం కరీం, తిరుచ్చి శివ, బినరు విశ్వం, జావిద్ ఆలీ ఖాన్, రాంగోపాల్ యాదవ్, సంజయ్ సింగ్, శక్తిసిన్హా గోయల్, కెసి వేణుగోపాల్ ఇచ్చిన నోటీసులను తిరస్కరించారు. వెంటనే ప్రతిపక్ష ఎంపీలు 19 మంది ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో సభ ప్రారంభమైన ఆరు నిమిషాలకే చైర్మెన్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమై సభలో డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ రూల్ నెంబర్ 256 ప్రకారం ఆప్ రాజ్యసభ పక్షనేత సంజరు సింగ్‌ను సస్పెండ్ చేస్తూ తీర్మానం ఆమోదించారు. మంగళవారం మద్యాహ్నం ప్రారంభమైన సభలో సంజరు సింగ్ చైర్మెన్ పోడియంపై కాగితాలు చించి విసిరారని, అందుకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సంజరు సింగ్ వెంటనే సభను బయటకు వెళ్లాలని ప్రకటించారు. వెంటనే రెండు నిమిషాలకే సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అయితే బయటకు వెళ్లకుండా సంజరు సింగ్ సభలో ఉన్నారు. తిరిగి ప్రారంభమైన సభలో డిప్యూటీ చైర్మెన్ నారాయణ్ సింగ్ సంజరు సింగ్‌ను బయటకు వెళ్లాలని ఆదేశించారు. అయినప్పటికీ తాను వెళ్లనని సంజ రు సింగ్ సభలోనే ఉన్నారు. దీంతో సభ ప్రారంభమైన సెకెన్లలోనే మద్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
లోక్‌సభలో కూడా అదే తీరు
లోక్‌సభలో సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వ హించారు. ప్రతి పక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని ప్రజా వ్యతిరేక ధరలు పెరుగుదలను ఆపాలి, ఆహార పదార్థాలపై జిఎస్టి ఉప సంహరించుకోవాలి, నలుగురు సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని హౌరెత్తించారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి
ఎంపీల సస్పెన్షన్‌పై సీపీఐ(ఎం) తీవ్ర ఆగ్రహం
ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పార్లమెంటరీ ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే అధిక ధరలు, జీఎస్టీ పెంపు, అగ్నిపథ్, నిరుద్యోగం.. మొదలైన అంశాలపై చర్చించాలని లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబ ట్టాయి. దేశంలో అత్యధికమందిని వేధిస్తున్న సమస్య లపై చర్చించి..సమాధానమివ్వాలని మోడీ సర్కార్‌ను డిమాండ్ చేశాయి. అయితే ప్రతిపక్షాల గొంతును పార్లమెంట్లో సైతం వినపడటానకి వీల్లేదు అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోంది. లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో 20మంది ఎంపీలను సస్పెండ్ చేసింది. ఎంప ీల సంఖ్యా బలముంది కదా..అని మోడీ సర్కార్ ఇష్టము న్నట్టు వ్యవహరిస్తోంది. ఎంపీల సస్పెన్షన్‌పై పొలిట్‌బ్యూరో బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఏముందంటే.. ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టే తీర్మానాలపై ఎలాంటి చర్చా జరగరాదన్న ధోరణితో కేంద్రం వ్యవహరిస్తోంది. ఇది పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధం. మరోవైపు సభలో ఏ అంశంపైనా చర్చించడానికి సిద్ధమని మోడీ సర్కార్ ప్రజలకు చెబుతోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే ఏ సమస్యపైనా చర్చించడానికి కేంద్రం సుముఖంగా లేదు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ఈ తీరుగా ఉండటానికి పూర్తి బాధ్యత మోడీ సర్కార్‌దే. ప్రతిపక్షాల గొంతును అణచివేయటం ద్వారా పార్లమెంట్ స్థాయిని దిగజార్చుతోంది. సమావేశాలు నిర్వహిస్తున్న తీరుతో ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా పోయింది. దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు కునేందుకు ప్రజలంతా ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చిందని, ఐక్యపోరాటాలతో మోడీ సర్కార్‌కు బుద్ధి చెప్పాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.