Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పదవి నుంచి తొలగింపు, టీఎంసీ నుంచి సస్పెన్షన్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల కుంభకోణంలో అరెస్టయిన పార్థాచటర్జీని మంత్రి పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గురువారం తొలగించింది. 'పరిశ్రమలు, వాణిజ్యం, ఎంటర్ ప్రైజెస్, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, పార్లమెంటరీ వ్యవహారాలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్, ఇండిస్టియల్ రీకన్స్ట్రక్షన్ శాఖలకు మంత్రిగా వ్యవహరించిన పార్థాచటర్జీని.. ఆ పదవుల నుంచి తొలగిస్తున్నాం' అని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. పార్థాచటర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, పార్టీ సెక్రెటరీ జనరల్, జాతీయ ఉపాధ్యక్షుడు పదవుల నుంచి తొలగించాలని పార్టీ క్రమశిక్షణా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిందని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ గురువారం తెలిపారు.