Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలక్షన్ కమిషన్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని 17 ఏండ్లు పైబడిన పౌరులు ఓటరు కార్డుకు ముందస్తుగానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు వీలును కల్పిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం తీసుకున్నది. దీనిపై గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవటానికి గతంలో జనవరి 1 నాటికి 18 ఏండ్లు వచ్చే వరకు ఎదురు చూడటం తప్పనిసరి కాదని వివరించింది. కాగా, ఈసీ నిర్ణయంతో ఓటరు కార్డు నమోదు కోసం 18 ఏండ్ల వరకు వేచి చూడాల్సినవసరముండదు. ఓటరు జాబితాలో యువత పేర్ల నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటు ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్రపాండే ఈ నిర్ణ యాన్ని వెలువరించారు. ముందస్తుగా ఓటరు నమోదుకు అవసరమైన సాంకేతికతను అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల్లోని సీఈఓ, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు ఆదేశాలు జారీ చేశారు.