Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలకు రావాల్సింది రూ. 4700 కోట్లకు పైగానే..!
- పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ : మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద వేతన బకాయిలు వేల కోట్ల రూపాయల్లో పేరుకు పోయాయి. జులై 21 నాటికి రాష్ట్రాలకు రావాల్సిన ఈ బకాయిల మొత్తం రూ. 4700 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నది. ఇందులో పశ్చిమ బెంగాల్‌కు అత్యధికంగా రూ. 2600 కోట్లకు పైగా, బీహార్‌కు రూ. 1000 కోట్లకు పైగా రావాల్సి ఉన్నది. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభలో ఎదురైన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానాన్నిచ్చింది. జులై 21 నాటికి రూ. 4,720.22 కోట్ల ఉపాధి వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సభకు నివేదించారు. ఈ సమాచారం ప్రకారం.. ఇందులో పశ్చిమ బెంగాల్‌కు అత్యధికంగా (రూ. 2620.87 కోట్లు) బకాయి ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్ (రూ. 1067.83 కోట్లు), యూపీ (రూ. 447.87 కోట్లు) రాష్ట్రాలున్నాయి. వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్న ఇతర పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీ) అసోం, గుజరాత్, జార్ఖండ్, లఢఖ్, మహారాష్ట్ర, నాగాలాండ్, ఒడిశా, తెలంగాణ, పుదుచ్చేరిలు ఉన్నాయి.