Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీలకు పిలుపు
- జనవరిలో ఒక రోజు సమ్మె
- దిగ్విజయంగా ముగిసిన అంగన్వాడీ అధికార్ మహాపడవ్
న్యూఢిల్లీ : దేశంలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆయా ఎంపీలను ''జవాబ్ మాంగో'' (సమాధానం అడగండి) అని అంగన్వాడీ లకు మహాపడవ్ పిలుపునిచ్చింది. మూడు రోజుల పాటు జరిగిన అంగన్వాడీ అధికార్ మహాపదవ్ గురువారం ముగిసింది. అలాగే జనవరి (2023)లో ఇతర స్కీమ్ వర్కర్లతో కలిసి ఒక రోజు సమ్మె చేయాలని మహాపడవ్ నిర్ణయించింది. ఒకపక్క తీవ్ర ఉష్టోగ్రతలు, మరోపక్క వర్షాలు వంటి ప్రతికూల వాతావరణంలో మూడు రోజుల పాటు జరిగిన అంగన్వాడీ అధికార్ మహాపడవ్ దిగ్విజయమైంది. అన్ని రాష్ట్రాల అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు జంతర్ మంతర్లో కదంతొక్కారు. వాస్తవానికి మహాపడవ్ నాలుగు రోజుల పాటు జరుగుతుందని తొలుత ప్రకటించారు. అందుకనుగుణంగా ఆయా రాష్ట్రాల అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఏర్పాట్లు చేసుకొని హస్తినాకు వచ్చారు. కానీ ఢిల్లీ పోలీసులు నాలుగో రోజుకు అనుమతి ఇవ్వకపోవ డంతో మూడు రోజుల పాటు నిర్వహించామని సంఘం నేత ఎఆర్ సింధూ తెలిపారు. తాము జైల్ భరో, పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని అనుకున్న ప్పటికీ, పోలీసులు అనుమతి నిరాకరించారన్నారు. మూడవ రోజు అంగన్వాడీ అధికార మహాపదవ్లో 21 రాష్ట్రాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. సీఐటీయూ అధ్యక్షురాలు కె హేమలత మాట్లాడుతూ ఐసీడీయస్ను కాపాడేం దుకు మరిన్ని పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత వివరించారు. 2006లో ఏఐఎఫ్ఏడబ్ల్యూహెచ్ నిర్వహించిన 10 రోజుల పగలు, రాత్రి మహాపడవ్ గురించి కూడా ఆమె గుర్తు చేశారు. సంస్థను బలో పేతం చేయాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
తెలంగాణ నుంచి...
ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం. పద్మ, పి. జయలక్ష్మి, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కవిత, రాజ్యలక్ష్మి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటమ్మ, పద్మ. వనపర్తి జిల్లా కార్యదర్శి శారద, వికారాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్సమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు.