Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : ఏ బలమైన ప్రభుత్వమైనా ప్రతీదాన్ని, ప్రతీ ఒక్కర్నీ నియంత్రించలేదని ప్రధానమంత్రి నరేంద మోడీ తెలిపారు. శుక్రవారం అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సంస్కరణల స్వభావాన్ని కలిగి ఉందని చెప్పారు. 'బలమైన ప్రభుత్వం అంటే అన్నింటినీ, ప్రతి ఒక్కర్నీ నియంత్రించాలనే భావన ఇంతకు ముందు ఉండేది. కానీ మేము దానిని మార్చాము. బలమైన ప్రభుత్వం ప్రతీ ఒక్కర్నీ లేదా ప్రతీదాన్ని నియంత్రించదు. బలమైన ప్రభుత్వం అనేది నిర్బంధం కాదు కానీ ప్రతిస్పందిస్తుంది. బలమైన ప్రభుత్వం ప్రతీ డొమైన్‌లోకి వెళ్లదు. తనను తాను పరిమితం చేసుకుంటుంది, ప్రజల ప్రతిభకు స్థలాన్ని ఇస్తుంది. బలమైన ప్రభుత్వ బలం దాని వినయంలోనే ఉంది. తనకు అన్ని తెలుసు, అన్ని చేయగలను అనేదాన్ని బలమైన ప్రభుత్వం అంగీకరించదు' అని మోడీ అన్నారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ 'విద్యకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని మేం నమ్ముతున్నాం. అందుకే అక్షరాస్యత పెంచడానికి 'ద్రవిడ మోడల్'లో పని చేస్తున్నాం' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముందుగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి స్వాగత ప్రసంగం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగానికి మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రిని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర సహాయ మంత్రి ఎల్, మురుగన్, అన్నా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వెల్రాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు..