Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్త మరణానంతరం మరో వివాహం చేసుకుంటే పిల్లల ఇంటిపేరును మార్చుకోవచ్చు
- సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : పిల్లల ఇంటిపేరు మార్చకునే విషయంలో తల్లికి గల హక్కుపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును ఇచ్చింది. భర్త చనిపోయిన తర్వాత మళ్లీ పెండ్లి చేసుకున్న తల్లికి.. మొదటి భర్త ద్వారా కలిగిన తన పిల్లల ఇంటి పేరును మార్చుకొనే హక్కు ఉన్నదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఒక మహిళ సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దినేశ్ మహేశ్వరి, కృష్ణ మురారి లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. న్యాయస్థానం ఆదేశాలు ''క్రూరం, బుద్దిహీనమైనవ''ని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో పిల్లల ఏకైక సహజ సంరక్షకురాలు తల్లి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టింది.