Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిలింగ్ సమావేశంలో తనపై వేసిన బహిష్కరణ వేటును వ్యతిరేకిస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం బదిలీ చేసింది. పన్నీర్ సెల్వం లేవనెత్తిన అంశాన్ని మూడు వారాల్లో విచారించాలని మద్రాస్ హైకోర్టును ప్రధాన న్యాయమార్తి ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అలాగే జనరల్ కౌన్సిలింగ్ సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన ఇకె పళనిస్వామితో సహా పార్టీలపై స్టేటస్ కో విధించింది.