Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్కతా : తాను కుట్రకు బలయ్యాయని అవినీతి కేసులో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్థా విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ టీచర్ల నియామకాలు, బదిలీల కోసం పెద్దమొత్తంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. పార్థా, ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ అరెస్టయ్యారు. ఇప్పటి వరకు సోదాల్లో సుమారు రూ.50 కోట్ల నగదు, 5 కిలోల బంగారాన్ని ఇడి స్వాధీనం చేసుకుంది. అర్పిత వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయని, వాటి నిండా డబ్బు ఉందన్న సమాచారంతో ఇడి గాలింపు చర్యలు చేపట్టింది. ఆయనను బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మంత్రి పదవి నుంచి తొలగించడంతోపాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఇడి అదుపులో ఉన్న ఆయన్ను మెడికల్ చెకప్ కోసం కొల్కతా జోకాలోని ఇఎస్ఐ ఆసుపత్రికి శుక్రవారం తరలించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. తాను కుట్రలో బాధితుడినయ్యానని అన్నారు.