Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత ఏడాది అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కేరళ అగ్రగామిగా నిలిచింది. 2021లో రాష్ట్రంలో కోవిడ్ రెండో దశ తీవ్రత అధికంగా ఉన్నా దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంతగా 61 రోజుల పాటు కేరళ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 2020లో మాత్రమే కరోనా నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహణలో ఎనిమిదో స్థానంలో ఉంది. 2016 నుంచి 2019 వరకూ సగటున ఏడాదికి 53 రోజుల పాటు కేరళ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 2021లో కేరళ తరువాత స్థానంలో 43 రోజులతో ఒడిషా రెండో స్థానంలో నిలిచింది. తరువాత కర్ణాటక, తమిళనాడు 40, 34 రోజులతో తరువాత స్థానంలో ఉన్నాయి. న్యూఢిల్లీకి చెందిన పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (పిఆర్ఎస్) సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.