Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ, ఏఐకేఎస్, ఎఐఏడబ్ల్యూయూ నేతలు తపన్‌సేన్, హన్నన్ మొల్లా, బి.వెంకట్
- ప్రజల్ని వేధిస్తూ..ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుతున్న కేంద్రం
- ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడతాం..
- 8న క్విట్ ఇండియా ప్రదర్శనలు
- సెప్టెంబర్ 5న జాతీయ సదస్సు
- సీఐటీయూ, ఏఐకేఎస్, ఎఐఏడబ్ల్యూయూ నేతలు తపన్‌సేన్, హన్నన్ మొల్లా, బి.వెంకట్
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ప్రజా, దేశ, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 14న జనజాగరణకు సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ ఉమ్మడిగా పిలుపు ఇచ్చాయి. ఈ మేరకు శుక్రవారం ఏఐకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శులు తపన్‌సేన్, హన్నన్ మొల్లా, బి.వెంకట్ మాట్లాడారు. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ మూడు సంఘాలు ఉమ్మడి ఆందోళలు చేపడుతున్నామని తెలిపారు. గత రెండేండ్లుగా ఉమ్మడిగా అనేక ఆందోళనలు చేపట్టామని, అలాగే క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 8న ప్రదర్శలను చేపట్టనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 5న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు పేర్కొన్నా రు. ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్ పేరుతో ప్రచారం చేస్తున్న మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, కోట్లాది మంది శ్రమజీవులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, స్వాతంత్రోద్యమంలో త్యాగాలు చేసిన ఇతర వర్గాల ప్రజల ఆకాంక్షలను, కలలను తుంగలో తొక్కే విధానాలను దూకుడుగా అనుసరిస్తోందని విమర్శించారు.
ప్రస్తుత మోడీ పాలనలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులతో పాటు అన్ని వర్గాల శ్రమజీవుల స్థితిగతులు నిరంతరంగా దిగజారిపోతున్నాయని అన్నారు. ప్రజల ఆరోగ్యం, జీవితాలు, జీవనోపాధిని రక్షించడానికి చర్యలు తీసుకోకుండా ప్రజలపై మరింత భారాన్ని మోపే చర్యలకు పాల్పడిందని విమర్శించారు. ప్రజలకు ఉపశమనాన్ని అందించడానికి బదులు, విదేశీ కార్పొరేట్ కంపెనీలతో సహా బడా కార్పొ రేట్లకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందించడానికి ప్రజా ధనాన్ని ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. వారికి భారీ సంపదను సమకూర్చిందని విమర్శించారు. ఈ విధానాల వల్ల ఆదాయ అసమానతలు తీవ్రంగా పెరిగాయని పేర్కొన్నారు.
ప్రశ్నిస్తే..విమర్శిస్తే నిర్భంధం : హన్నన్ మొల్లా
పాలకుల విధానాల్ని ప్రశ్నించినవారిని నిర్బంధిస్తున్నారు. జర్నలిస్టులు, మేథావులు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తల్ని వేధిస్తోంది. బెయిల్ రాని సెక్షన్లను నమోదుచేస్తూ జైల్లో నిర్బంధిస్తోంది. జర్నలిస్టు మహ్మద్ జుబైర్ అరెస్టు ఇందుకు ముఖ్య ఉదాహరణ. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరిగాయి. ఇవన్నీ కనిపించకుండా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో ప్రజల్ని మభ్యపెట్టాలని కేంద్రం చూస్తోంది. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేయడానికి సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ సంయుక్తంగా ఐక్య ప్రచార ఉద్యమానికి సిద్ధమయ్యాయి. గ్రామాలు, పట్టణాలకు వెళ్లి ప్రజల్ని చైతన్యవంతం చేస్తాయి.
''దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని మోడీ సర్కార్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటానికి తెరలేపింది. అయితే ఈ ప్రభుత్వం అసలు రంగు బయటపెట్టే విషయాల్ని ప్రజలకు చేరవేయాల్సిన అవసరముంది. స్వతంత్ర పోరాటంలో కార్మికులు, కర్షకులు వివిధ వర్గాలకు చెందిన వారు ప్రాణాలు అర్పించారు. బ్రిటీష్ వలసపాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేశారు. నేడు మోడీ సర్కార్ బ్రిటిష్ వలస పాలన విధానాల్నే అనుసరిస్తోంది. మరోవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుతోంది'' అని సంయుక్త ప్రకటనలో సీఐటీయూ, ఏఐఏకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ తెలిపాయి.