Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా ఆందోళనలు
- ఉభయ సభలు సోమవారానికి వాయిదా
- అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా ఆందోళనలు
- ఉభయ సభలు సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ : అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించడంలో ప్రధాన బాధ్యత వహించాల్సిన అధికారం పక్షం కూడా ఆందోళనలకు దిగింది. కేకలు, నినాదాలతో హౌరెత్తించింది. దీంతో పార్లమెంట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. పలుమార్లు వాయిదాలు పడటం.. కొన్ని నిమిషాల పాటే పార్లమెంట్ ఉభయ సభలు జరిగాయి. శుక్రవారం లోక్‌సభ కేవలం 6.25 నిమిషాలు జరగగా, రాజ్యసభ 12 నిమిషాల పాటు సమావేశం మాత్రమే జరిగింది.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం నుంచి ప్రతిపక్షాలు ధరలు పెరుగుదల, ద్రవ్యోల్బనం, ఆహార పదార్థాలపై జీఎస్టీ పెంపు, అగ్నిపథ్ వంటి అంశాల పై చర్చించాలని పట్టుపడుతున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అటు లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా, ఇటు రాజ్యసభలో చైర్మెన్ వెంకయ్య నాయుడు ఆయా అంశాలపై చర్చకు అనుమతిం చటం లేదు. ఆయా అంశాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసులను తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రతిపక్షలు సభల లోపల, వెలుపల ఆందోళన చేస్తూనే ఉన్నాయి. ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకొని, వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శించి నందుకు, ఆందోళన చేసినందుకు ఇప్పటికీ 27 మంది రాజ్యసభ, లోక్‌సభ సభ్యులను సస్పెండ్ చేశారు.
గత రెండు రోజుల నుంచి ప్రతిపక్షాల ఆందో ళనలకు, అధికార పక్షం ఆందోళనలు తోడయ్యాయి. రాష్ట్రపత్ని అంశపై అధికారం పక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. సభను అడ్డుకుంటున్నారు. సభ నిర్వహణకు సహకరించటం లేదు. అదే ప్రతి పక్షాలు ఆందోళన చేస్తే, సభా సజావుగా సాగడం ప్రతిపక్షాలుకు ఇష్టం లేదని పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. ఆయనే ఇప్పుడు అధికార పక్షం ఆందోళనల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఇదే బీజేపీ ద్వంద వైఖరి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అయితే ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడం ఇదేమీ కొత్తకాదు. తొలిసారి అంతకంటే కాదు. గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ పార్లమెంట్‌ను స్తంభింప జేసింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా అరుణ్ జైట్లీ ప్రజా స్వామ్యంలో ఆందోళనలు కూడా ఒక భాగమేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా పార్ల మెంట్‌ను అడ్డుకోవడాన్ని ఆయన సమర్థించారు. కానీ ఇప్పుడు అదే పార్టీల ఇప్పుడు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడానికి నిరసనలను, ప్లకార్డులను ప్రదర్శించడాన్ని సాకుగా చూపుతోంది.
శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగాగే ధరలు పెరు గుదలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు హౌరెత్తించగా, అధికార పార్టీ సభ్యులు సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలని నినాదాలు ఇచ్చారు. వెంటనే ప్యానల్ స్పీకర్‌గా ఉన్న ప్రేమ్‌జీబాయి సోలంకి సభను 25 సెకెన్లలోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రార ంభమైన సభలోనూ అధికార, ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. దీంతో సభ ప్రారంభమై ఆరు నిమిషాల్లోనే ప్యానల్ స్పీకర్ రాజేంద్ర అగర్వల్ సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే తంతూ నడిచింది. సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వివిధ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరించారు. ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకొని వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు.
అధికార బీజేపీ సభ్యులు తమ స్థానాల్లో నిల్చోని నినాదాలతో హౌరెత్తించారు. దీంతో సభలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. వెంటనే సభ ప్రారంభమైన 10 నిమిషాలకే మద్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో కూడా అధికార, ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ఇరు పక్షాల సభ్యులు సహకరించాలని, ఆందోళనలు ఆపాలని ప్యానల్ చైర్మన్ సస్మిత్ పాత్ర కోరగా, అధికార, ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే సోమవారానికి వాయిదా వేశారు. పార్లమెంట్ ఆవరణంలో సస్పెండ్ అయిన 27 మంది ఎంపిలు తమ ఆందోళనను కొనసాగించారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సస్పెండ్ ఎంపీలు ఆందోళన కొనసాగింది. సస్పెండ్ అయిన ఎంపీలకు మద్దతుగా మిగతా సభ్యులు ఆందోళనలో చేరారు.