Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అద్దెదారులకు బకాయిల చెల్లింపుల్లో విఫలం
- డిజిసిఎకు యుఎఇ కంపెనీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: చౌక ధరల విమాన యాన సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న స్సైస్‌జెట్ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారుతున్నట్టు స్పష్టమవు తోంది.ఇప్పటికే నగదు లభ్యత సమ స్యను ఎదుర్కొంటున్న స్పైస్ జెట్ అద్దెకు తీసుకున్న విమానాలకు సంబంధించిన బాకాయిల చెల్లింపు ల్లోనూ తాజాగా విఫలమయ్యింది. యూఏఈకి చెందిన దుబయి ఏరో స్పేస్ ఎంటర్ప్రైజ్ (డీఏఈ) మూడు బోయింగ్ 737 ఎయిర్క్రాప్టులను స్పైస్‌జెట్‌కు అద్దెకు ఇచ్చింది. వీటి అద్దెలను తమకు చెల్లించడం లేదని డిఎఇ తాజాగా విమానయాన సంస్థల రెగ్యూలేటర్ డీజీసీఏకు ఫిర్యాదు చేసింది. ఆ మూడు విమానాల నమోదును రద్దు (డీ రిజిస్టర్) చేయాల ని విజ్ఞప్తి చేసింది. జెట్ ఎయిర్వేస్ మూత పడిన తర్వాత డీఏఈ నుంచి 2019లో విటి-ఎస్వైడబ్ల్యు, విటి-ఎస్వైఎక్స్, విటి- ఎస్వైవై లను అద్దెకు తీసుకుంది. వీటి అద్దె చెల్లింపులు చేయకపోవడంతో డీఈఏ పలుమార్లు స్సైస్జెట్తో చర్చలు జరిపింది. ప్రయోజనం లేకపోవడంతో తుదకు డీజీసీఏకు ఫిర్యాదు చేసింది. విక్రేతలకు చెల్లిం పులు చేయడంలో స్పైస్‌జెట్ విఫలమైనట్టు గతేడాది సెప్టెంబర్‌లో డీజీసీఏ ఆడిట్లో వెల్లడయ్యింది. పరికరాలకు సైతం చెల్లింపులు చేయ లేని పరిస్థితిని ఎదుర్కొంటుందని వెల్లడయ్యింది. గత నెల రోజులుగా స్పైస్‌జెట్ విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు బయటపడు తున్నాయి. గడిచిన 24 రోజుల్లో స్పైస్‌జెట్ విమానాల్లో 9 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తడం గమనార్హం. వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే ఎనిమిది వారాల పాటు కేవలం 50 శాతం విమానాలతోనే కార్యకలాపాలను సాగించాలని జులై 27న ఆదేశి ంచింది. దీంతో స్టాక్ మార్కెట్లలో స్పైస్‌జెట్ షేర్లు భారీగా పడిపో తున్నాయి. తాజా బకాయిల పరిణామంతో సోమవారం సెషన్లో ఈ సూచీ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలున్నాయి.