Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీది అధికార దుర్వినియోగం : శరద్ పవార్
- పార్లమెంట్లో సంఖ్యా బలముందని చెలరేగిపోతోంది..
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, దీనిపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. పార్లమెంట్లో సంఖ్యా బలముంది కదా..అని బీజేపీ చెలరేగిపోతోందని అన్నారు. సామాన్య పౌరుడు తిరగబడితే బీజేపీ అధికారం ఎంతోకాలం నిలబడదన్నారు. ధూలేలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం లో మాట్లాడుతూ శరద్‌పవార్‌పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి ప్రజలే గట్టి సమాధానం చెబుతారని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముపై కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో పెద్ద రగడకు దారితీసింది. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ పట్ల బీజేపీ ఎంపీలు వ్యవహరించిన తీరును శరద్ పవార్ తప్పుబట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అధీర్ రంజన్ రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు. కానీ లోక్‌సభలో బీజేపీ సోనియాగాంధీని టార్గెట్ చేసింది. క్షమాపణలు చెప్పాలని ఆమెను చుట్టుముట్టారు. బీజేపీ ఎంపీలు, మంత్రులు సోనియా మీదకు వచ్చారు. మా పార్టీ ఎంపీ సుప్రీయా సూలే రక్షణగా నిలిచి సోనియాను ఆమె వాహనం వరకు తీసుకెళ్లారు. లేదంటే ఆ రోజు పెద్ద గలాటా జరిగేదే'' అని పవార్ తన కార్యకర్తలకు వివరించారు. మన వైఖరి వారికి అనుకూలంగా లేకపోతే బీజేపీ అధికార దుర్వినియోగానికి దిగుతోందన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ వ్యవహారశైలిని పవార్ తప్పుబట్టారు. ''ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే గవర్నర్ విధి. కొత్త స్పీకర్ ఎన్నుకుంటామని రెండేండ్లుగా కోరితే మాకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. అదే కొత్త ప్రభుత్వం రాగానే రెండు రోజుల్లో ఓకే చెప్పారు. ఇలాంటి గవర్నర్ ఉంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?'' అని ఆవేదన వ్యక్తం చేశారు.